ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకున్నారు.ఇక సుజీత్ లాంటి దర్శకుడు సైతం ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి కేవలం ఆయన రెండు సినిమాలనే చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి.
తన తోటి దర్శకులందరు 10 సినిమాలు చేస్తే ఆయన కేవలం రెండు సినిమాలు చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం.

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో చేస్తున్న ఓజి సినిమా( OG movie ) సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడని కొద్దిగా సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.కాబట్టి ఈ సినిమా మీద ఆశలు పెట్టుకొని చాలా వరకు ముందుకు వెళ్తున్నాడు.
మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఈ సినిమా బ్యాలెన్స్ ఉన్న షూట్ మొత్తాన్ని తొందర్లోనే ఫినిష్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుజీత్ సినిమా సినిమాకు మధ్య ఇంత గ్యాప్ తీసుకోవడం అనేది అతని ఫాన్స్ ని తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది.ఆయన రెండో సినిమా అయినా సాహో సినిమా( Saaho movie ) వచ్చి దాదాప 6 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు మరొక సినిమా రిలీజ్ చేయలేదు.కారణం ఏదైనా కూడా ఆయన ఇంతలా సినిమాల కోసం ఎదురుచూయించడం అనేది సరైన విషయం కాదు.ఇక పవన్ కళ్యాణ్ దగ్గర స్టిక్ అయిపోయినప్పటికి గ్యాప్ లో మరొక సినిమా చేసి ఉంటే బాగుండేది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే నానితో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు…
.