బ‌రువును త‌గ్గించి శ‌రీరానికి శ‌క్తినిచ్చే సూప‌ర్ డ్రింక్ ఇది..!

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, మ‌ద్య‌పానం, హార్మోన్ల అసమతుల్యత వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో తీవ్రంగా మ‌ద‌న ప‌డుతున్నారు.బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల శ‌రీర ఆకృతి అస‌హ్యంగా మార‌మే కాదు గుండె పోటు, మ‌ధుమేమం, క్యాన్స‌ర్ వంటి ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ‌చ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.

 This Is A Super Drink That Reduces Weight And Gives Energy To The Body Details!-TeluguStop.com

అందుకే పెరిగిన బ‌రువు త‌గ్గించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ డ్రింక్ ను తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే శ‌క్తి కూడా ల‌భిస్తుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ సూప‌ర్ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ లో ఆరు న‌ల్ల ఎండు ద్రాక్ష‌లు, రెండు వాల్ న‌ట్స్‌, రెండు ఎండిన అత్తిపండ్లు, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే బ్లెండ‌ర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న వాల్ న‌ట్స్‌, అత్తిపండ్లు, న‌ల్ల ఎండు ద్రాక్ష‌లను వాట‌ర్ స‌హా వేసుకోవాలి.

Telugu Energy, Tips, Latest-Latest News - Telugu

అలాగే ఒక క‌ప్పు బాదం పాలు, మూడు గింజ‌ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధమ‌వుతుంది.

బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో ఈ డ్రింక్‌ను తీసుకుంటే అతి ఆక‌లి దూరం అవుతుంది.ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో వేగంగా బ‌రువు త‌గ్గుతాయి.అలాగే పైన చెప్పిన సూప‌ర్ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే శ‌క్తి ల‌భిస్తుంది.నీర‌సం, అల‌స‌ట వంటివి దూరం అవుతాయి.గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.మ‌రియు బ్రెయిన్ షార్ప్‌గా కూడా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube