వయసు పైబడిన తర్వాత కూడా చాలా మందికి యవ్వనంగా మెరిసిపోవాలనే కోరిక ఉంటుంది.కానీ ఆ కోరికను నెరవేర్చుకోవడం ఎలాగో తెలియక సతమతం అవుతుంటారు.
అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ తో రోజు నైట్ ఫేస్ మసాజ్( Face Massage ) చేసుకుంటే 60లోనూ మీరు యవ్వనంగా మెరిసిపోతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకోవాలి.చివరిగా చిటికెడు కుంకుమ పువ్వు వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఆయిల్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఎలాంటి మేకప్ ఉన్నా సరే తొలగించి వాటర్ తో ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆపై తడి లేకుండా టవల్ తో ఫేస్ ను తుడుచుకోవాలి.ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మ్యాజికల్ ఆయిల్ ను ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే చర్మం యవ్వనంగా మృదువుగా మెరుస్తుంది.
ముడతలు( Wrinkles ), చర్మం సాగటం, చారలు వంటి వృద్ధాప్య లక్షణాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

చర్మం టైట్ గా మారుతుంది.అలాగే ఈ ఆయిల్ లో కుంకుమపువ్వు వాడటం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.అదే సమయంలో చర్మం స్మూత్ గా సాఫ్ట్ గా మారుతుంది.
డ్రై స్కిన్( Dry Skin ) అన్నమాట అనరు.అంతే కాదండోయ్ ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడటం వల్ల మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.
డార్క్ సర్కిల్స్( Dark Circles ) దూరం అవుతాయి.మరియు చర్మం సూపర్ షైనీ గా, గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.
కాబట్టి వయసు పై బడిన అందంగా యవ్వనంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ మ్యాజికల్ ఆయిల్ ను ప్రిపేర్ చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.







