ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తో బాన పొట్టను నెల రోజుల్లో మాయం చేసుకోండి!

బాన పొట్ట.( Pot Belly ) స్త్రీ పురుషుల్లో కోట్లాది మందిని మదన పెడుతున్న సమస్య ఇది.

 Best Drink For Burning Belly Fat Details! Fat Cutter Drink, Belly Fat, Latest Ne-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండడం, మద్యపానం, శరీరానికి శ్రమ లేకపోవడం, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంది.దాంతో పొట్ట బానలా తయారవుతుంది.

మీరు కూడా బాన పొట్టతో బాధపడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్టర్ డ్రింక్( Fat Cutter Drink ) మీ డైట్ లో ఉండాల్సిందే.ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకుంటే నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Fennel Seeds ) వేసుకోవాలి.

ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ మరియు రెండు లెమన్ స్లైసెస్ వేసుకుని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.

Telugu Belly Fat, Fat Cutter, Fennel Seeds, Tips, Honey, Latest, Lemon, Pot Bell

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధం అయినట్టే.ఈ డ్రింక్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు లేదా నైట్ నిద్రించడానికి గంట ముందు అయినా తీసుకోవచ్చు.

Telugu Belly Fat, Fat Cutter, Fennel Seeds, Tips, Honey, Latest, Lemon, Pot Bell

ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.బెల్లీ ఫ్యాట్ సమస్యను నివారించడానికి ఈ డ్రింక్‌ ఉత్తమంగా సహాయపడుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను రోజు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

మలబద్ధకం సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube