ముద్దు ఓ మధురానుభవం.ప్రేయసి పెదాల్లో మధువు వెతుకుతాడు ప్రియుడు, సాధిస్తాడు కూడా.
ఆ అనుభవం మాటల్లో చెప్పడం కష్టం కాని, ముద్దుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ముద్దుల సైన్స్ ని పిలేమాటోలాజీ అని అంటారు
* ముద్దులపై రిసెర్చి చేసే శాస్త్రవేత్తలను ఓస్కులోలోజిస్ట్ అని అంటారు
* 1439 సంవత్సరంలో కింగ్ హెన్రి VI ఇంగ్లండులో కిస్సింగ్ ని బ్యాన్ చేసాడు.
ఒకరి నోటి నుంచి మరొకరి నోటికి క్రిములు చేరి వ్యాధులు రాకూడదని ఈ పనిచేసాడు
* చేతివేళ్ళ కన్నా 100 రెట్లు మృదువుగా, సెన్సిటీవ్ గా ఉంటాయి పెదాలు.అందుకే ముద్దు పెట్టుకోవడం ఓ తిపి అనుభవం* ముద్దు పెట్టుకున్నప్పుడు 146 కండరాలు పనిచేస్తాయి
* 1930 లో హాలివుడ్ లో ముద్దు సన్నివేశాలు మూడు సెకన్లకి మించి ఉండకూడదు అనే రూల్ వచ్చింది.
ఆ తరువాత ఈ రూల్ ని పక్కనెట్టేసారు
* ముద్దు పెట్టుకోవడం వలన సాధారణ సందర్భంలో కంటే చాగా వేగంగా గుండె కొట్టుకుంటుంది.మెదడుకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది
* కిస్సింగ్ స్ట్రెస్ ని తగ్గిస్తుందని పరిశోధనలు తెలిపాయి* ఎక్కచై – లక్సన అనే థాయ్ లాండ్ జంట, విరామం లేకుండా 58 గంటల, 35 నిమిషాల, 58 సెకన్లు ముద్దు పెట్టుకున్నారు.
ప్రపంచంలో లాంగెస్ట్ కిస్ ఇదే.దీనికి ముందు కూడా వరల్డ్ రికార్డ్ వీరిద్దరి పేరు మీదే ఉండటం గమనార్హం.