ఉత్తర దిక్కుకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు?

మకర సంక్రమణం రోజు నుండి సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తాడు.ఉత్తరాయణ మహా పుణ్య కాలం అంటారు.

పడిన భీష్మాచార్యులు ఈ ఉత్తరాయణం మరణం కోసం వేచి చూశాడంటే దీని ప్రాధాన్యం మనకు అర్థం అవుతుంది.ఉత్తరాయణం పరమాత్మ నిలయం.

అందుచేతనే ముక్కోటి దేవతలూ ఉత్తర దిక్కునే నివసిస్తారు అన్నది పెద్దల మాట.ఉత్తర దిక్కు ఉత్తరాయణం బహు పుణ్య ప్రదమన్నది మన విశ్వాసం.ఎందుకంటే ఉత్తర దిక్కునే పవిత్ర గంగా నది పుట్టింది.

బదరికాది పుణ్య భూములలో నరనారాయణులు ఉద్భవించారు.నారదుడు, మౌద్గల్యుడు, గౌతముడు మొదలైన ఋషులు ఎందరో హిమా లయాల్లో తపస్సు చేసి మంత్ర ద్రష్టలు అయ్యారు.

Advertisement

పూర్వము కురు మహా రాజులు ఉత్తర భూములను దున్ని కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా మార్చారు.అలాగే ఇంటి నిర్మాణంలో కూడా ఉత్తర దిక్కుకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు.

ఉత్తరం వైపునే ద్వారం ఉండాలనేది వాస్తు శాస్త్ర నియమం.నిబంధన.

అలాంటప్పుడు తప్పని సరిగా ఉత్తర ద్వారం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఉత్తరం వైపున ఇతరుల ఇళ్ళు ఉండి, మనకు ఉత్తరంలో ఖాళీ ఉండే అవకాశం లేనప్పుడు మన ఇంటిని ఉత్తరం వైపు మూడడుగులు గానీ, కనీస పక్షం రెండడుగులు గానీ, ఉత్తరం గోడని వెనక్కు జరిపి అక్కడ ఖాళీ ఏర్పాటు చేసుకోవాలి.అలాగే, ఇంటి నిర్మాణంలో ఉత్తరం దిక్కున పంచభూతాలు కనిపించేట్టుగా, వర్షం పడేట్టుగా ఆ ఉత్తరాన్ని ఖాళీ చేసినప్పుడు దక్షిణ సింహద్వారం కలిగిన ఇంటికి మంచి దశ - దిశ ఏర్పడుతుంది.

అలా చేసుకున్నట్టయితే గృహానికి మంచి ఫలితం దొరుకుంది.పంచభూతాలు చేరని గృహం గృహంగా పరిగణించబడదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 17, శుక్రవారం, మార్గశిర మాసం 2021
Advertisement

తాజా వార్తలు