దీపావళి రోజు ఈ మూడు దీపాలను వెలిగిస్తే దరిద్రం వదిలి లక్ష్మి కటాక్షం కలుగుతుంది

దీపావళి అనగానే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అలాగే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఆనందంగా చేసుకుంటారు.ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకొని సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి టపాసులు కాల్చుతారు.

 This Deepam On Deepavali Can Make You Rich-TeluguStop.com

ప్రజలను పీడిస్తున్న నరకాసురుని సత్యభామ చంపిన ఆనందంలో ఈ దీపావళి పండుగను జరుపుకుంటున్నాం.

అయితే దీపావళి రోజున చేయవల్సిన కొన్ని పనులు ఉన్నాయి.

వాటిని చేస్తే దరిద్రం వదిలి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.దీపావళి రోజున దీపాలు చాలా దీపాలను వెలిగిస్తూ ఉంటాం.

అయితే ముఖ్యంగా మూడు దీపాలను వెలిగించాలి.ముందుగా మూడు ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు వేయాలి.

మొదటి దీపం కింద నువ్వులు వేసి వెలిగించాలి.ఈ దీపం మన పెద్దల కోసం.

చనిపోయిన మన పెద్దలు దీపావళి రోజున ఈ దీపం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.ఈ దీపం మన పెద్దలకు చేరి మనల్ని సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తారు.

ఇక రెండో దీపం కింద ఉప్పు వేసి వెలిగించాలి.ఈ దీపం మృత్యు భయాన్ని తరిమి కొడుతోంది.

మూడో దీపం కింద బియ్యం వేసి వెలిగించాలి.ఈ దీపం మన కులదైవానికి చేరుతుంది.

ప్రమిదలో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయటం వలన దరిద్రం పోయి లక్ష్మి కటాక్షము కలుగుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU