పుదీనా( Mint ) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.సాధారణంగా పుదీనాను నాన్ వెజ్ వంటల్లో మరియు బిర్యానీ, పులావ్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ప్రత్యేకమైన సువాసన కలిగి ఉండే పుదీనా ఆహారం రుచిని పెంచడమే కాదు బోలెడన్ని ఆశ్చర్యపోయే ఆరోగ్య లాభాలను కూడా అందిస్తుంది.
ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గాలని( Weight Loss ) ప్రయత్నిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.
అలాంటి వారికి పుదీనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రోజు ఉదయం ఒక గ్లాసు వేడి నీటిలో మెత్తగా దంచిన నాలుగు పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.
ఇది మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.పైగా పుదీనా వికారం, వాంతులు మరియు ఇతర జీర్ణశయాంతర సమస్యలను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది.
పుదీనా ఆకులలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.ఇవి నోటి బ్యాక్టీరియాతో పోరాడటానికి, నోటి దుర్వాసనను( Bad Breath ) తగ్గించడానికి మరియు చిగుళ్ళను రక్షించడానికి సహాయపడతాయి.నిత్యం నాలుగు పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమిలితే నోటి దుర్వాసన అన్న మాటే అనరు.
జులుబు, దగ్గు, కఫం వంటి సమస్యలను అరికట్టడంలో కూడా పుదీనా హెల్ప్ చేస్తుంది.ఒక గ్లాసు వాటర్ లో 10 ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు దంచిన మిరియాలు వేసి ఎనిమిది నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని తీసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ పుదీనా వాటర్ తాగితే జలుబు, దగ్గు, కఫం ఎగిరిపోతాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇక ఒత్తిడిని నివారించడంలో పుదీనా టీ తోడ్పడుతుంది.
పుదీనా టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి మీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి.
పుదీనాలో విటమిన్ ఎ కూడా మెండుగా ఉంటుంది.ఇది కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.