ఆరోగ్యమైన దృఢమైన జుట్టుకు మందారం నూనె.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా?

మందారం( Hibiscus ) అలంకరణకు మాత్రమే కాదు కురుల సంరక్షణకు సైతం అద్భుతంగా తోడ్పడుతుంది.అనేక జుట్టు సంబంధిత సమస్యలకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది.

 Hibiscus Oil For Healthy Strong Hair! Hibiscus Oil, Healthy Strong Hair, Healthy-TeluguStop.com

ముఖ్యంగా మందారం పూలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా నూనె తయారు చేసుకుని వాడితే ఆరోగ్యమైన దృఢమైన కురులు మీ సొంతం అవుతాయి.మందారం నూనె తయారీ కోసం.

స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె పోసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఆముదం( castor oil ), నాలుగు టేబుల్ స్పూన్లు బాదం నూనె మరియు రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకోవాలి.

చివరిగా ఎనిమిది నుంచి పది ఫ్రెష్ మందారం పూలు లేదా ఎండిన మందారం పూలు ( Dried hibiscus flowers )వేసి ఉడికించాలి.దాదాపు పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో తయారు చేసుకున్న మందారం ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Healthy, Hibiscus, Hibiscusoil, Latest-Telugu Health

ఇప్పుడు ఈ మందారం ఆయిల్ ను వారానికి రెండు సార్లు స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ మందారం నూనె మూలాల నుంచి జుట్టును దృఢంగా మారుస్తుంది.

జుట్టు రాలడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.

Telugu Care, Care Tips, Healthy, Hibiscus, Hibiscusoil, Latest-Telugu Health

మందారం నూనెలో ఉండే విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ కురులను ఆరోగ్యంగా మారుస్తాయి.హెయిర్ డ్యామేజ్ సమస్యను అరికడతాయి.చిట్లిన జుట్టును రిపేర్ చేయడమే కాకుండా కురులను మృదువుగా మెరిపిస్తాయి.

అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

మందారం ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యమైన దృఢమైన జుట్టు మీ సొంతమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube