ఈ ఒక్క పొడిని రోజూ తీసుకుంటే ఆరోగ్యం, అందం రెండూ పెరుగుతాయి!

ఆరోగ్యం, అందం.రెండిటినీ పెంచుకోవాలంటే అది తీసుకునే ఆహారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది.

 This Powder Helps To Improve Health And Beauty! Improve Health, Health Tips, Goo-TeluguStop.com

అందుకే నిపుణులు డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాల‌ని చెబుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే పొడిని రోజూ తీసుకుంటే గ‌నుక చాలా సుల‌భంగా ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ పొడి ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ విధంగా తీసుకోవాలి.? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని.అందులో రెండు స్పూన్ల స‌న్ ఫ్లెవ‌ర్ సీడ్స్‌, రెండు స్పూన్ల చియా సీడ్స్‌, రెండు స్పూన్ల న‌ల్ల నువ్వులు, రెండు స్పూన్ల అవిసె గింజ‌లు, నాలుగు బ్రెజిల్ న‌ట్స్‌, ఐదు జీడిప‌ప్పులు వేసి స్లో ఫ్లేమ్‌పై లైట్‌గా వేయించుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీట‌న్నిటినీ చ‌ల్లార బెట్టుకోవాలి.ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసి.ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకుంటే దాదాపు నెల‌ల రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

ఇక ఈ సూప‌ర్ హెల్తీ పొడిని రోజుకు ఒక స్పూన్ చ‌ప్పున గ్లాస్ వాట‌ర్‌లో లేదా పాల‌లో మిక్స్ చేసి తీసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు ఉద‌యాన్నే చేస్తే గ‌నుక నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.కంటి చూపు మెరుగు ప‌డుతుంది.

బ్రెయిన్ షార్ప్‌గా ప‌ని చేస్తుంది.మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది.అలాగే చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు రాకుండా ఉంటాయి.ఒక‌వేళ ఉన్నా క్ర‌మంగా మ‌టుమాయం అవుతాయి.

మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.కాబ‌ట్టి, ఖ‌చ్చితంగా ఈ పొడిని తీసుకోవ‌డానికి ట్రై చేయండి.

This Powder Helps To Improve Health And Beauty! Improve Health, Health Tips, Good Health, Beauty, Beauty Tips, Natural Powder, Skin Care, Skin Care Tips - Telugu Tips, Improve, Natural Powder, Skin Care, Skin Care Tips

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube