సాధారణంగా కొందరు జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది.కానీ కొందరి జుట్టు మాత్రం ఎంతో పల్చగా ఉంటుంది.
పల్చటి జుట్టు( Thin Hair ) కలిగిన వారికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ పెద్దగా సెట్ అవ్వవు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.జుట్టు ఎంత పల్చగా ఉన్న కూడా ఈ ఆయిల్ తో సులభంగా మరియు వేగంగా ఒత్తుగా మార్చుకోవచ్చు.
ఆయిల్ తయారీ కోసం.కేవలం రెండే రెండు పదార్థాలు ఉంటే సరిపోతుంది.అందులో ఒకటి ఆవ నూనె( Mustard Oil ) కాగా.మరొకటి ఉసిరికాయలు.
( Amla ) ముందుగా ఐదు నుంచి ఆరు ఉసిరికాయలు తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, అర కప్పు ఆవనూనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసుకోవాలి.అలాగే మరొక కప్పు ఆవనూనె వేసి చిన్న మంటపై దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
దాంతో మన ఆయిల్ అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆమ్లా ఆయిల్( Amla Oil ) కురుల ఆరోగ్యానికి అండగా ఉంటుంది.
వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను తలకు పట్టించి మసాజ్ చేసుకుంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.

అలాగే ఈ ఆమ్లా ఆయిల్ జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.కొత్త జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది.పల్చటి కురులు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారతాయి.అంతేకాకుండా ఈ ఆమ్లా ఆయిల్ తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.కురులు నల్లగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.