యూరిన్ లీక్ అవుతుందా.. కార‌ణాలేంటో తెలుసా?

యూరిన్ లీకేజ్‌.( Urine Leakage ) ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మందిని క‌ల‌వ‌ర పెట్టే స‌మ‌స్య ఇది.

 What Are The Causes Of Urine Leakage Details, Urine Leakage, Urine Leakage Prev-TeluguStop.com

ద‌గ్గిన‌ప్పుడు, నవ్విన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు తదిత‌ర సంద‌ర్భాల్లో యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది.మహిళల్లో ప్రసవం తర్వాత ఈ స‌మ‌స్య ఎక్కువగా కనిపిస్తుంది.

దీని వ‌ల్ల తీవ్ర‌మైన అసౌకర్యానికి గుర‌వుతుంటారు.అయితే అస‌లు యూరిన్‌ లీకేజ్ కు కార‌ణాలేంటి.? ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిన్ లీకేజ్ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు.మ‌హిళ‌ల్లో గర్భధారణ టైమ్ లో హార్మోన్ల మార్పుల వల్ల, మెనోపాజ్( Menopause ) సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడం వ‌ల్ల‌ యూరిన్ లీక్ అవ్వొచ్చు.

మూత్రాశయాన్ని మరియు మూత్రనాళాన్ని నియంత్రించే కండరాలు బ‌ల‌హీనంగా మార‌డం, వృద్ధాప్యం, శస్త్రచికిత్సలు, ప్ర‌స‌వం, మూత్రాశయ సమస్యలు, ఒబేసిటీ, బరువు ఎక్కువగా ఉండటం యూరిన్ లీకేజ్ కు కార‌ణం అవుతుంటాయి.

Telugu Tips, Latest, Menopause, System, Prostate Gland, Urine Leakage-Telugu Hea

పురుష‌ల్లో ప్రొస్టేట్ గ్రంథి( Prostate Gland ) విస్తరించడం వ‌ల్ల యూరిన్ లీక్ అవ్వొచ్చు.నరాల సమస్యలు, మ‌ధుమేహం, ఎక్కువ కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం, కొన్ని ర‌కాల మందుల వాడ‌కం కూడా యూరిన్ లీకేజ్ కు కారణం.ఇక‌పోతే యూరిన్ లీకేజ్ సమస్యను తగ్గించేందుకు కొన్ని మార్గాలను అనుసరించవచ్చు.

అధిక బరువు( Over Weight ) వల్ల పెల్విక్ ఫ్లోర్‌పై ఒత్తిడి పెరిగి యూరిన్ లీకేజ్ ఎక్కువ అవుతుంది.మూత్రాశయ నియంత్రణ‌కు త‌ప్ప‌నిస‌రిగా శ‌రీర బ‌రువును అదుపులోకి తెచ్చుకోవాలి.

అందుకోసం తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, మరియు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి.

Telugu Tips, Latest, Menopause, System, Prostate Gland, Urine Leakage-Telugu Hea

అలాగే కాఫీ, ఆల్కహాల్ పరిమితం చేయాలి.అధిక ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.ప‌గ‌టి పూట నీరు ఎక్కువ‌గా తాగాలి.సిగరెట్ పొగ తాగడం వల్ల తుమ్మడం, దగ్గడం ఎక్కువ అవుతాయి, ఇది మూత్ర లీకేజ్‌ను మరింత పెంచుతుంది.అందుద‌ల్ల సిగ‌రెట్స్ కు దూరంగా ఉండండి.మూత్రాన్ని నియంత్రించేందుకు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకోండి.

సడన్ లిఫ్టింగ్ మ‌రియు ఒత్తిడి తగ్గించండి.వ్యాయామాలు మ‌రియు జీవనశైలి మార్పులతో సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

అవసరమైతే వైద్యులు సూచించిన మందులు వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube