మహారాష్ట్రలో( Maharashtra ) అప్పుల బాధతో ఓ రైతు( Farmer ) చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.సతీష్ ఇడోలే అనే రైతు తన కష్టాన్ని చెప్పుకోడానికి ఏకంగా తన కుటుంబ సభ్యుల శరీర భాగాలను అమ్మకానికి పెట్టాడు.
అప్పులు తీర్చలేక చస్తున్నానంటూ ఆవేదనతో రోడ్డు మీదికి వచ్చి నిలబడ్డాడు.
వాషిం మార్కెట్‌లోకి ఓ ప్లకార్డు పట్టుకుని వచ్చాడు సతీష్.
దానిపై ‘రైతుల అవయవాలు అమ్మబడును’ అని రాసి ఉంది.కిడ్నీలు రూ.75 వేలు, లివర్ రూ.90 వేలు, కళ్లు రూ.25 వేలు అంటూ రేట్లు కూడా పెట్టాడు.జనాలు ఒక్కసారిగా గుమిగూడి ఆ ప్లకార్డు చూడటం మొదలుపెట్టారు.

“ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.ఎన్నికల ముందు రుణమాఫీ( Loan Waiver ) చేస్తామని ఊదరగొట్టారు.తీరా ఇప్పుడు లోన్లు కట్టమంటున్నారు.మేం ఏం అమ్ముకుని కట్టాలి? అందుకే మా అవయవాలు అమ్ముకుంటున్నా.అయినా లక్ష రూపాయలు కూడా రావట్లేదు.అందుకే నా భార్య కిడ్నీ రూ.40 వేలు, పెద్ద కొడుకు కిడ్నీ రూ.20 వేలు, చిన్న కొడుకు కిడ్నీ రూ.10 వేలు అంటూ రేట్లు పెట్టా” అని విలేకరుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు ఇడోలే.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా లెటర్ రాశాడు సతీష్.ఎన్నికల హామీని గుర్తు చేశాడు.అప్పులు తీర్చలేకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటున్నాడు ఆ రైతు.
రెండెకరాల భూమి ఉన్న సతీష్ కు మహారాష్ట్ర బ్యాంకులో లక్ష రూపాయల అప్పు ఉంది.డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మొన్నటికి మొన్న రైతులు వాళ్ల అప్పులకు వాళ్లే బాధ్యత వహించాలని, ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేయదని తెగేసి చెప్పేశారు.
“7/12 భూ రికార్డులు క్లియర్ చేస్తామన్నారు.కానీ ఇప్పుడు లోన్లు కట్టమంటున్నారు.
పంటలకు గిట్టుబాటు ధర లేదు.క్వింటాల్ సోయాబీన్స్ 3 వేలకు అమ్ముతున్నారు.
రైతులను మోసం చేశారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.సతీష్ చేసిన ఈ వినూత్న నిరసన ఇప్పుడు హాట్ టాపిక్.
రైతుల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.