అధరాలు(పెదవులు).అందంగా, ఎర్రగా ఉంటే ముఖం మరింత కాంతి వంతంగా ఉంటుంది.
కానీ, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్‌ను యూజ్ చేయడం, ఎండల ప్రభావం, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి, ధీర్గకాలిక అనారోగ్య సమస్యలు, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం వంటి కారణాల వల్ల అందంగా ఉండాల్సిన అధరాలు కాస్త నల్లగా, అందవిహీనంగా మారుతుంటాయి.దాంతో పెదవులను మళ్లీ ప్రకాశవంతంగా మార్చుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ లిప్ బామ్‌ను వాడితే గనుక మీ పెదవుల అందం రెట్టింపు అవ్వడం ఖాయం.మరి ఆలస్యమెందుకు ఆ న్యాచురల్ లిప్ బామ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక పెద్ద సైజ్ కీర దోస తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలు మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి.
జ్యూస్‌ను మాత్రం వేరుచేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కీర జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా మరిగించాలి.కీర జ్యూస్ సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల కీర జ్యూస్, ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని.
కాసేపు ఫ్రిడ్జ్‌లో పెడితే లిప్ బామ్ సిద్ధమైనట్టే.
ఈ లిప్ బామ్‌ను వాడటం వల్ల పెదవులు సహజంగా ఎర్రగా, అందంగా మారతాయి.
పెదాలు పొడి బారడం, పగలడం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.మరియు లిప్స్ ఎల్లప్పుడూ మృదువుగా, షైనీగా మెరుస్తాయి.