ఇండియాలో కామన్ సెన్స్ ఏమైపోయింది, పబ్లిక్ మర్యాదలు మర్చిపోయారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే, @Ravi3pathi అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్.
ఆ వీడియోలో ఓ మహిళ రైలు సీట్లలో( Train Seat ) హాయిగా పడుకుని, కాళ్లను మాత్రం ఎదురుగా ఉన్న ఆర్మ్‌రెస్ట్‌పై( Armrest ) పెట్టేసింది.
మహిళ( Woman ) మొహం కనిపించకపోయినా, ఆమె చేసిన పని మాత్రం నెటిజన్లకు మండిపోయేలా చేసింది.“ఇండియాలో సివిక్ సెన్స్(
Civic Sense ) అనేది ప్రాంతీయ సమస్య కాదు, క్లాస్ సమస్య కాదు… ఇది కేవలం ఇండియన్ సమస్య” అంటూ @Ravi3pathi క్యాప్షన్ కూడా పెట్టారు.
ఈ పోస్ట్ చూస్తుండగానే వైరల్ అయిపోయింది.
అప్పుడే 8 లక్షల 72 వేల వ్యూస్ దాటేసింది.చాలామంది ఆ మహిళని తిట్టిపోస్తున్నారు.పబ్లిక్ ప్లేస్‌లో ఇంత అహంకారమా అని ఏకిపారేస్తున్నారు.“ఇదేం పద్ధతి? కనీసం మనుషులన్నా ఉన్నారనే జ్ఞానం లేదా?” అని ఒకరు కామెంట్ చేస్తే, “పొరుగువారికి ఇబ్బంది కలిగించకూడదని కూడా తెలియదా? సిగ్గుండాలి” అని ఇంకొకరు ఫైర్ అయ్యారు.“ఇలాంటి వాళ్ల వల్లే సమాజం దిగజారిపోతుంది” అని మరికొందరు తెగ బాధపడిపోతున్నారు.
కొందరు మాత్రం ఈ ఇష్యూని ఇంకాస్త లోతుగా ఆలోచిస్తున్నారు.“ఇది కేవలం ఒక్కరి తప్పు కాదు.మనందరి బాధ్యత.
ప్రజలకు పబ్లిక్ బిహేవియర్ గురించి చెప్పాల్సిన టైమ్ వచ్చింది” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు.ఇంకొకరు ఏమన్నారంటే, “డబ్బున్నోళ్లు, పేదోళ్లు అని కాదు.
ఇది పెంపకం, అవగాహన లేకపోవడం వల్లే జరుగుతుంది.చిన్నప్పటినుంచే పిల్లలకు పబ్లిక్ ప్రాపర్టీని రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి” అని సూచించారు.
ఇంకొందరు మాత్రం ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారు.“కొన్ని ఏరియాల్లో ఇది నార్మల్‌గా తీసుకోవచ్చు, కానీ చాలా చోట్ల ఇది అస్సలు ఒప్పుకోరు” అని ఒక యూజర్ అభిప్రాయపడ్డారు.
రూల్స్ లేకపోవడం, ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఇంకొందరు అంటున్నారు.“రూల్స్ లేవు, ఎవరూ ఏమీ అనరు అనే ధైర్యంతోనే ఇలాంటి పనులు చేస్తారు” అని ఒకరు వాపోయారు.“పబ్లిక్ ప్లేస్ అంటే అందరిదీ.ఇలాంటి పనులు చేస్తే, పక్కవాళ్ల సౌకర్యం ఏమైపోవాలి?” అని మరొకరు ప్రశ్నించారు.మొత్తానికి ఈ డిస్కషన్ చూస్తుంటే, పబ్లిక్ ప్లేస్‌లో ఎలా ప్రవర్తించాలో చాలామందికి తెలియడం లేదని, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థమవుతోంది.రూల్స్ పెట్టి గట్టిగా అమలు చేస్తే తప్ప ఇలాంటివి ఆగవేమో.