అధిక బ‌రువు ఉన్న‌వారు డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఏమ‌వుతుందో తెలుసా?

చూడ‌టానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా, తిన‌డానికి రుచిక‌రంగా ఉండే పండ్ల‌లో డ్రాగ‌న్ ఫ్రూట్( Dragon fruit ) ఒక‌టి.డ్రాగ‌న్ ఫ్రూట్ ఖ‌రీదు కొంచెం ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.

 Do You Know What Happens When Overweight People Eat Dragon Fruit? Dragon Fruit,-TeluguStop.com

పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి డ్రాగ‌న్ ఫ్రూట్ ఒక వ‌ర‌మ‌ని అంటారు.

ముఖ్యంగా అధిక బ‌రువు స‌మ‌స్య‌తో ( overweight problem )బాధ‌ప‌డుతున్న వారికి డ్రాగ‌న్ ఫ్రూట్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.బరువు తగ్గాలనుకునే సమయంలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లలో ఒకటి డ్రాగన్ ఫ్రూట్.

ఎందుకుంటే.ఈ పండులో కేలరీలు మ‌రియు కార్బోహైడ్రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి.ఫైబర్ మరియు వాట‌ర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.అదనపు కిలోలను తగ్గించడానికి సరైన కలయిక ఇది.ఫైబ‌ర్ మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పైగా అధిక ఫైబ‌ర్ క‌డుపును సంతృప్తిగా ఉంచుతుంది.ఇది ఒక రోజులో తక్కువ కేలరీలను తినేలా చేస్తుంది.

అలాగే డ్రాగ‌న్ ఫ్రూట్ లోని వాట‌ర్ కంటెంట్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో తోడ్ప‌డుతుంది.

Telugu Eatdragon, Dragonfruit, Tips, Latest-Telugu Health

డ్రాగన్ ఫ్రూట్‌లో బీటాసైనిన్ ( Betacyanin )అనే పదార్ధం ఉంటుంది, ఇది మీ లిపిడ్ ప్రొఫైల్‌ను నిర్వహించ‌డానికి హెల్ప్ చేస్తుంది.శరీర కొవ్వు అసాధారణ లిపిడ్ ప్రొఫైల్‌తో ( lipid profile )ముడిపడి ఉంటుంది.అందువ‌ల్ల సమతుల్య ఆహారంలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే శరీరంలోని చెడు కొవ్వు పెరుగుద‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుంది.

Telugu Eatdragon, Dragonfruit, Tips, Latest-Telugu Health

అంతేకాకుండా డ్రాగ‌న్ ఫ్రూట్ లో ఉండే మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.ఐరన్ సమృద్ధిగా ఉండ‌టం కార‌ణంగా డ్రాగ‌న్ ఫ్రూట్ ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి చర్మానికి ఆరోగ్యం, ప్రకాశం అందిస్తాయి.డ్రాగ‌న్ ఫ్రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అందువల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.

సో.మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా డ్రాగ‌న్ ఫ్రూట్ ను తీసుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube