అదిదా ట్విస్ట్.. భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త.. కానీ చివరకు?

భారతీయ వివాహ వ్యవస్థ (Indian marriage system)అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధమే కాదు, కుటుంబాలు, సంస్కృతి, నమ్మకాల మిశ్రమంగా కొనసాగుతుంది.అయితే, నేటి రోజుల్లో పెళ్లికి ముందు చివరి నిమిషంలో వచ్చే ట్విస్టులు, వివాహేతర సంబంధాల కారణంగా పెళ్లిళ్లు రద్దు కావడం, విడాకులు తీసుకోవడం వంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి.

 That's The Twist.. The Husband Who Gave His Wife To His Lover And Married Her..-TeluguStop.com

పెళ్లి పీటల మీద నుంచి వధువు పారిపోవడం, వరుడు అనుకున్న పెళ్లిని రద్దు చేసుకోవడం వంటి ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.అయితే, ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఓ వ్యక్తి తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి జరిపించడం, ఆమె మళ్లీ మొదటి భర్త దగ్గరకు తిరిగి రావడం అద్భుతమైన ట్విస్ట్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌ నగర్‌‌లోని కతార్ జూట్ గ్రామానికి(village of Katar Jute in Sant Kabir Nagar, Uttar Pradesh) చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

జీవనోపాధి కోసం బబ్లూ పని నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లాడు.అయితే, ఈ గ్యాప్‌లో రాధిక అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో ప్రేమలో పడింది.

రాధిక ప్రేమ కాస్త ఆ తర్వాత వివాహేతర సంబంధాన్ని బలంగా కొనసాగించింది.చివరికి, తన భర్త బబ్లూకు ఈ వ్యవహారం తెలిసిపోయింది.

బబ్లూ ఈ వ్యవహారాన్ని ప్రశ్నించినా రాధిక మాత్రం వెనక్కి తగ్గలేదు.ఆమె స్పష్టంగా తన భర్తతోనే.

నేను వికాస్‌తోనే జీవితం గడపాలనుకుంటున్నా అని చెప్పేసింది.దీంతో బబ్లూ తన భార్యను కట్టప్పలాగా విడిచిపెట్టడం కాదు.

కాస్త వినూత్నంగా స్పందించాడు.ఆమెను అడ్డుకోకుండా తానే స్వయంగా వచ్చి ఆమెను వికాస్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు.

Telugu Drama, Indian, Love Triangle, Twist, Trend, Uttar Pradesh-Latest News - T

దానితో రాధిక తన ప్రియుడు వికాస్‌తో(Radhika and her boyfriend Vikas) కొత్త జీవితం మొదలు పెట్టింది.అయితే, పెళ్లి జరిగిన రెండురోజులకే రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ వద్దకు తిరిగి వచ్చింది.దీనికి కారణం వికాస్ కుటుంబం ఆమెను అంగీకరించకపోవడమే.వికాస్ తల్లి ఈ విషయంలో పెద్ద పాత్ర పోషించింది.బబ్లూ తన పిల్లల్ని ఒంటరిగా పోషించాల్సిన బాధ్యత తీసుకున్నాడు.రాధిక వెళ్లిపోవడంతో అతడు కష్టాలు పడుతున్నాడు అంటూ వికాస్‌కి వివరించింది.

వికాస్ ఈ మాటలు విని, ‘అయితే ఆమె తన మొదటి భర్త దగ్గరికే వెళ్లిపోవాలి’ అంటూ రాధికను తిరిగి పంపించేశాడు.

Telugu Drama, Indian, Love Triangle, Twist, Trend, Uttar Pradesh-Latest News - T

దానితో రాధిక తిరిగి తన మొదటి భర్త బబ్లూ దగ్గరకు చేరింది.ఈ విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లి, బబ్లూ రాధికను తిరిగి తన జీవితంలోకి అంగీకరించాడు.అతడు పెద్దల సమక్షంలో నేను నా భార్యను తిరిగి స్వీకరిస్తాను.

పిల్లల భవిష్యత్తు కోసం మేమిద్దరం కలిసి జీవనం సాగిస్తాం అని వెల్లడించాడు.ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం, కానీ నిజజీవితంలో ఇలా జరగడం చాలా విచిత్రం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube