ఒక్క చిన్న దాతృత్వం. కెనడాలో( Canada ) ఓ భారతీయ విద్యార్థి జీవితాన్నే మార్చేసింది.
పాకిస్థానీ( Pakistani ) వ్యక్తి చేసిన ఓ చిన్న సాయం ఇప్పుడు సంచలనంగా మారింది.అసలు విషయం తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా షాక్ అవుతారు.
అసలు ఏం జరిగిందంటే, హమ్జా అజీజ్.( Hamza Aziz ) కెనడాలో నర్సుగా పనిచేస్తూ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా పాపులర్.
ఆయనో రోజు ఉబర్ ఈట్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశారు.కానీ ఆర్డర్ ఏదో తేడా కొట్టింది.డెలివరీ చేయడానికి వచ్చిన నవ్‌నీత్( Navneet ) అనే వ్యక్తి ఒక్కడే మళ్లీ వెళ్లి కరెక్ట్ ఆర్డర్ తెచ్చి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.నవ్‌నీత్ డెడికేషన్‌కి ఫిదా అయిపోయిన హమ్జా అతనికి ఏకంగా 100 కెనడియన్ డాలర్లు టిప్ ఇచ్చాడు.అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.6,000 అన్నమాట.
మాట్లాడుతూ ఉండగా నవ్‌నీత్ తన కష్టాల గురించి హమ్జాతో చెప్పుకున్నాడు.కుటుంబానికి దూరంగా కెనడాలో ఉంటున్నానని, ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు.అంతేకాదు, తనకో పెద్ద కల ఉందని కూడా చెప్పాడు.సొంతంగా ఓ బార్బర్ షాప్( Barber Shop ) పెట్టుకోవాలని ఉందని నవ్‌నీత్ చెప్పడంతో హమ్జా ఆశ్చర్యపోయాడు.
హమ్జా నవ్‌నీత్‌కి టిప్ ఇచ్చిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దాంతో వీడియో క్షణాల్లో వైరల్( Viral Video ) అయిపోయింది.
హమ్జా దాతృత్వాన్ని, నవ్‌నీత్ కష్టపడే తత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు.ఓ వ్యాపారవేత్త ఈ వీడియో చూసి నవ్‌నీత్‌కి బార్బర్ ట్రైనింగ్ స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చాడు.
హమ్జా మరో వీడియోలో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు.నవ్‌నీత్ బార్బర్ ట్రైనింగ్ పూర్తి చేసి సొంతంగా షాప్ కూడా పెట్టేశాడట.ఈ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి హమ్జా స్వయంగా నవ్‌నీత్ షాప్‌కి వెళ్లి హెయిర్ కట్ కూడా చేయించుకున్నాడు.
ఈ స్టోరీకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
హమ్జా మంచి మనసుని, నవ్‌నీత్ కష్టాన్ని పొగుడుతూ కామెంట్స్ పెట్టారు.అయితే కొందరు మాత్రం “బార్బర్ అవ్వడానికి కెనడా ఎందుకు వెళ్లాలి? పంజాబ్‌లో కూడా బార్బర్ స్కూల్స్ ఉన్నాయి కదా?” అంటూ కామెంట్ చేశారు.మొత్తానికి చాలా మంది మాత్రం “హీ ఇస్ సో స్వీట్” అంటూ పాజిటివ్‌గా స్పందించారు.
హమ్జా అజీజ్ పాకిస్థాన్ నుంచి కెనడాకు వలస వచ్చిన వ్యక్తి.
ప్రొఫెషనల్‌గా నర్సు, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్.తన యూట్యూబ్ ఛానల్‌లో కెనడాలో కష్టపడి పనిచేసే వ్యక్తుల స్ఫూర్తిదాయక కథల్ని షేర్ చేస్తుంటాడు.
వాళ్ల కష్టాల్ని, సమాజానికి వాళ్ల కాంట్రిబ్యూషన్‌ని హైలైట్ చేయడమే హమ్జా లక్ష్యం.