వర్షాకాలం( Rainy season) మొదలవడంతో వానలు పడుతూనే ఉన్నాయి.దీనివల్ల మన రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
అలాగే జుట్టు, చర్మం, ఆరోగ్యం పై కూడా చెడు ప్రభావం పడుతుంది.చల్లని గాలి, ఆహ్లాదంగా ఉండే వాతావరణం, చల్ల చల్లని చిరుజల్లులు బలేగా అనిపిస్తాయి.
కానీ ఈ వాతావరణం ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.అందుకే వర్షాకాలం వచ్చినప్పుడు సమతుల్యత, మన శ్రేయస్సును కాపాడుకోవడానికి మన ఆహారపు అలవాట్లను జీవనశైలిని మార్చుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్ లో నెయ్యిని కచ్చితంగా తీసుకోవాలి.ఎందుకంటే ఇది వర్షాకాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.అసలు వర్షాకాలంలో నెయ్యిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వర్షాకాలంలో నెయ్యిని తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలలో మెరుగైన జీర్ణ క్రియ( Digestion) ఒకటి.
తేమతో కూడిన వాతావరణం లో కూడా నెయ్యి సులభంగా జీర్ణమవుతుంది.దీనిలోని లక్షణాలు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

అంతేకాకుండా కడుపులో మంటను కూడా ఇవి తగ్గిస్తాయి.నెయ్యి( ghee ) తీసుకోవడం వల్ల గట్ లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది.అంతేకాకుండా వికారం, ఉబ్బరం, మలబద్దకం వంటి సాధారణ జీర్ణాశయంతర సమస్యలను తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే నెయ్యి కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వర్షాకాలంలో వాతం, కఫ్ఫా, దోషాలు ఎక్కువైనప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా ఈ సీజన్ లో వచ్చే జలుబు( Cold ), ఫ్లూ నుంచి రక్షించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.నెయ్యిలో ఒమేగా త్రీ కొవ్వు అమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ k లు ఉంటాయి.ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలపేతం చేయడానికి ఎన్నో వ్యాధులను రక్షించడానికి ఉపయోగపడతాయి.







