సాధారణంగా బయట ఉన్న విద్యార్థులకు అన్ని వసతులను కల్పించినా కొంతమంది విద్యార్థులు మంచి మార్కులను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్నారు.అయితే ఒక విద్యార్థి మాత్రం జైలులో చదువుకుని గోల్డ్ మెడల్ సాధించారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్1( Student No: 1 ) సినిమాలో జైలు శిక్ష అనుభవిస్తూ ఎంతో కష్టపడి తన లక్ష్యాన్ని సాధిస్తాడనే సంగతి తెలిసిందే.
అదే విధంగా అస్సాం రాజధాని గౌహతి( Guwahati )లో కొన్నేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఒక విద్యార్థి నాయకుడు అరెస్ట్ కావడం జరిగింది.
ఆ తర్వాత జైలులో చదువుకోవాలని సంజీవ్ తాలుక్ దార్ ( Sanjeev Talukdar)భావించారు.ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ పూర్తి చేసిన ఈ విద్యార్థి యూనివర్సిటీ పరిధిలో ఎక్కువ మార్కులను సొంతం చేసుకొని గోల్డ్ మెడల్ ను పొందడం గమనార్హం.

ఎం.ఏ సోషియాలజీ( MA Sociology) కోర్సును పూర్తి చేసిన సంజీవ్ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ను అందుకుని వార్తల్లో నిలిచారు.సంజీవ్ తన పట్టుదల వల్లే కెరీర్ పరంగా సక్సెస్ సాధించాడని జైలు అధికారులు సైతం వెల్లడించారు.
కొత్త విషయాలను నేర్చుకోవడం అంటే సంజీవ్ కు ఎంతగానో ఆసక్తి అని జైలు అధికారులు వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

సంజీవ్ గోల్డ్ మెడల్( Gold Medal ) సాధించడం ఆయన కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.సంజీవ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.సంజీవ్ బయట ఉండి ఉంటే కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగేవారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సంజీవ్ కు జైలు అధికారుల నుంచి కూడా సహాయసహకారాలు లభించడం వల్ల ఆయన కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.






