Amitabh Bachchan: అమితాబ్ తెలుగు భాషని చూసి నవ్వుకుంటున్న తెలుగు జనం.. కారణం ఇదే!

అమితాబ్( Amitabh Bachchan ) గురించి తెలియని వారుండరేమో.ఆయనకు కోట్ల మంది అభిమానులున్నారు.

 People Are Laughing At Amithab Bacchan For Poor Telugu-TeluguStop.com

ఇప్పటికి చాలా మంది ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు.ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

హిందీలోనే కాదు కథ నచ్చితే ఏ భాషలో అయినా నటిస్తున్నారు.ప్రభాస్- నాగ్ అశ్విన్ చేస్తున్న అత్యంత భారీ చిత్రం ప్రాజెక్టు కె లో నటిస్తున్నాడు.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ , దీపికా పదుకొనె నటిస్తుండగా తాజాగా కమల్ హాసన్( Kamal Haasan) కూడా ఈ సినిమలో చేస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు.

ప్రాజెక్ట్ K లో కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నాడని సమాచారం.కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్ లోకి యాడ్ అయ్యాక ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటివరకు ఏ సినిమాకి ఖర్చు చేయనంత బడ్జెట్ ఈ సినిమాకి ఖర్చు చేస్తున్నారు.ఇప్పటికే వరుస ప్లాప్ లతో ఉన్న ప్రభాస్ కి సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు చాలా ముఖ్యం.

ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి చూపు ఈ సినిమాలపైనే ఉంది.అంతే కాదు షూటింగ్ స్పాట్ కి వెళ్లి చూసినవారందరు ఈ సినిమా ఎవ్వరు ఊహించని స్థాయిలో ఉండబోతుందని చెబుతున్నారు.

దీంతో సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది.

అయితే ఈ సినిమా టైం ట్రావెల్ లో ఉంటుందని, కొత్త టెక్నాలజీ గురించి ఉంటుందని అంటున్నారు.అయితే ఈ సినిమాలో తనకి ఛాన్స్ ఇచ్చినందుకు మరియు ప్రభాస్ తన పట్ల గౌరవం కనబరుస్తున్నందుకు అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.అయితే ఇప్పుడు ఆ ట్వీట్ అందరిని నవ్విస్తుంది.

అయన ఏమని ట్వీట్ చేసారంటే.

I am honoured and have had the great privilege of being a part of this great enterprise in Telugu Cinema , ‘Project K’ and to have had the huge honour of being in the same frame of the Idol , Prabhas .Thank you all .and thank you Nagi Sir, for thinking of me .The humility , the respect and the concern Prabhas has given me has been so so touching & emotional .Not for me , but for all those involved in ‘Project K’ , may your hard work touch new horizons .love and prayers

ఇలా అని అమితాబ్ ట్వీట్ చేస్తే అది తెలుగులో ట్రాన్సలేట్ చేయగా పూర్తి అర్థమే మారిపోయింది.తెలుగు సినిమా మరియు దాని ఆరాధ్యదైవం ప్రభాస్( Prabhas ) కీర్తిలో ఉండాలనే గౌరవం మరియు గొప్ప అధికారాన్ని పొందడం.

నేను ధన్యుడిని అని మాత్రమే చెప్పగలను.వారి వినయం, వారి గౌరవం, వారి శ్రద్ధ చాలా హత్తుకునే మరియు భావోద్వేగ … నా కోసం కాదు, ‘ప్రాజెక్ట్ K’లో పాలుపంచుకున్న వారి కోసం, మీరు పడిన కష్టాన్ని వర్ధిల్లాలని మరియు కొత్త క్షితిజాలను పొందాలని కోరుకుంటున్నాను…’’ట్రాన్స్‌లేషన్ ఇలా రావడంతో ఇది చదివిన వాళ్ళందరూ నవ్వుతున్నారు.అమితాబ్ గారు టీంలో తెలుగు తెలిసినవాళ్లతో ట్వీటించవచ్చు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube