కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.తొలి విడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు.
కాగా ఢిల్లీ లో పల్లు చోట్ల వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న తీరులో ఆయన పరిశీలించి ప్రకటించారు.
తొలి విడత వ్యాక్సిన్ లో భాగంగా కోటి మంది వైద్య సిబ్బందికి, రెండు కోట్ల వర్కర్లకు ఉచితంగా టీ కా అందచేస్తామని తర్వాత 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఎలా అందివాలనే విషయం పై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.
కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ బృందం నమ్మకంతో కేంద్రమంత్రి ప్రకటించారు.

కాగా ఈ రోజు దేశ వ్యాప్తంగా టీకా జరుగుతుందని తెలిపారు.కాగా ఈ వ్యాక్సిన్ వచ్చే వదంతులు నమ్మవద్దని తెలిపారు.ఈ టీ కకు సంబంధించిన విషయం లో మొదట ప్రభుత్వమే నమ్మకం ఇస్తుందని తెలిపారు.116 జిల్లాలు 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ విధానం శనివారం రోజున ఉదయం ప్రారంభమైన విషయాన్ని తెలిపారు.
టీకా పంపిణీ చేసే ప్రదేశాలలో పనితీరు గురించి పరిశీలించారు.
డిసెంబర్ 28, 29 దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన మొదటి విడతలో లోపాలు ఎదురవగా వాటిని నివారించి కొత్త మార్గదర్శకాల ప్రకారం కొత్త విధానాన్ని నిర్వహించారని తెలిపారు.ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రా జెనెకా సౌజన్యంతో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన టీకా అత్యవసర సమయంలో వాడటానికి కేంద్ర ఔషధ ప్రమాణాలు నియంత్రణ సంస్థ నిపుణుల బృందం ఈ టీకా కు సంబంధించిన విధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ టీ కా ను సరైన పద్ధతిలో అందివ్వాలని డీసీజీఐ కు కోరింది.