వర్షాకాలంలో మీ ఇంట్లో ఉండే ఈ వస్తువులు అనేక వ్యాధులకు కారణమవుతాయని తెలుసా..?

ప్రస్తుతం వర్షాకాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు( Health problems ) వస్తూ ఉంటాయి.వర్షాకాలంలో అధిక తేమ కారణంగా వాతావరణంలో బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుంది.

 Do You Know That These Items In Your House Can Cause Many Diseases During Monso-TeluguStop.com

ఇలాంటి సమయంలో దాదాపు ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా ఇంట్లో మనం ప్రతి రోజు ఉపయోగించే వస్తువుల పై బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతుంది.

అది నేరుగా మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల అనేక వ్యాధులను కలిగిస్తుంది.ఒక అధ్యయనం ప్రకారం ఇంట్లో వినియోగించే కొన్ని వస్తువులు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి.

మరి ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Diseases, Problems, Tips, Keyboard, Pillow Covers, Rainy Season, Remote C

మీ టాయిలెట్ సీటు పై ఉంచిన వాటి కంటే ఒక వారం పాటు ఉతకకుండా ఉంచిన దిండు కవర్ల( Pillow Covers )లో 17వేల రేట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.ఇంకా అలాగే ఇన్ఫెక్షన్ వ్యాప్తి జాబితాలో స్మార్ట్ ఫోన్ అగ్ర స్థానంలో ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.ఒక అధ్యయనం ప్రకారం మీ స్మార్ట్ ఫోన్( Smartphone ) లో టాయిలెట్ సీటు కంటే సగటున 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే పని సమయంలో తరచుగా తాకే మరో వస్తువు కీబోర్డు.యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అధ్యయనం ప్రకారం సగటున కీబోర్డ్ లో చదరపు అంగుళానికి మూడు వేల బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

Telugu Diseases, Problems, Tips, Keyboard, Pillow Covers, Rainy Season, Remote C

అలాగే సగటు రిమోట్ కంట్రోల్( Remote control ) లో చదరపు అంగుళానికి 200 బ్యాక్టీరియా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ వెల్లడించింది.అలాగే రిఫ్రిజిరేటర్ డోర్ లో చదరపు అంగుళానికి 500 బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే కంప్యూటర్ మౌస్ పై చదరపు అంగుళానికి 1500 బ్యాక్టీరియా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియ అధ్యయనంలో తేలింది.అలాగే చేతులు కడుక్కున్న తర్వాత సబ్బు లేదా హ్యాండ్ వాష్ తో కొద్దిగా శుభ్రం చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube