సినిమాల్లో హీరో హీరోయిన్లే కాదు కమెడియన్లు కూడా కెమిస్ట్రీ పండిస్తారు.కమెడియన్లు కూడా నిజంగా భార్య భర్తలు లాగానే కనిపిస్తారు.
అప్పట్లో రాజబాబు రమాప్రభ, రేలంగి, బ్రహ్మానందం, హేమ, కోవై సరళ, శ్రీ లక్ష్మి, సుత్తివేలు ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో కమెడియన్లు భార్యాభర్తలుగా నటించి హాట్ సాంగులకు స్టెప్పులు కూడా వేస్తూ రొమాన్స్ పండించారు.అయితే హీరోలు, కమెడియన్లే కాదు విలన్ జంటలు కూడా వెండితెరపై భార్య భర్తలు గా కనిపించి ప్రేక్షకులను బాగా అలరించారు.అయితే ఆ జంటలు ఎవరో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
1.గోపీచంద్ – రాశి
గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో హీరోగా నటించే వారు.అయితే ఆయన మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాతో విలన్ గా మారారు.హీరోయిన రాశి కూడా నిజం సినిమాతో తనలోని నెగటివ్ కోణాన్ని చూపించారు.అయితే ఈ సినిమా లో రాశి, గోపీచంద్ లవర్స్ గా కనిపించి సెగలు పుట్టించారు.
వీళ్లిద్దరి జంట ఎంతగా కెమిస్ట్రీ పండించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గోపీచంద్ జయం సినిమాలో కూడా ఓ లేడీ ఆర్టిస్ట్ తో రొమాన్స్ చేసి మతులు పోగొట్టేసారు.
2.ప్రదీప్ రావత్ – బిందు చంద్రమౌళి
ప్రముఖ విలన్ ప్రదీప్ రావత్ బిందు చంద్రమౌళి తో కలిసి “నేనే రాజు నేనే మంత్రి” సినిమా లో కెమిస్ట్రీ పండించారు.
ఈ సినిమాలో వీళ్లిద్దరు చూడ్డానికి నిజంగా భార్య భర్త లాగానే కనిపించారంటే అతిశయోక్తి కాదు.నేను శైలజ, సై వంటి చిత్రాల్లో కూడా ప్రదీప్ రావత్ హీరో లెవల్లో రొమాన్స్ చేసి తనలోని మరో కోణాన్ని చూపించారు.
3.ప్రదీప్ రావత్ – విజయవాణి
పంచాక్షరి సినిమా లో విలన్ పాత్రల్లో నటించిన ప్రదీప్ రావత్, విజయవాణి భార్యభర్తల పాత్రల్లో జీవించేసారు.
4.బాబు మోహన్ – వడివుక్కరసి
అమ్మోరు మూవీలో విలన్ పాత్రలో నటించిన బాబు మోహన్ అందర్నీ ఫిదా చేశారు.అయితే ఆయనకు భర్తగా నటించిన వడివుక్కరసి తన పాత్రలో జీవించేసారు.బాబు మోహన్.జయలలిత, అనుజ వంటి కమెడియన్లతో విపరీతంగా రొమాన్స్ చేసేవారు.
5.కోట శ్రీనివాస్ రావు – జయమాలిని
బిగ్ బాస్ మూవీ లో కోట శ్రీనివాస్ రావు, జయమాలిని భార్య భర్తలుగా నటించి మెప్పించారు.
6.ప్రకాష్ రాజ్ – సరిత
అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్ తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించారు.అయితే ప్రతి సినిమాలో ఆయనకు భార్య గా ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించి మెప్పించారు.
7.శియాజీ షిండే
విలన్ శియాజీ షిండే సరసన కూడా టాలీవుడ్ లేడీ ఆర్టిస్టులు ఎందరో నటించి మెప్పించారు.ఆయన కూడా భర్త పాత్రలను చాలా చక్కగా పోషిస్తారు.
8.వరలక్ష్మి శరత్ కుమార్, కటారి కృష్ణ
ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన క్రాక్ మూవీలో జయమ్మ గా వరలక్ష్మి శరత్ కుమార్, కటారి కృష్ణ గా సముద్రఖని నటించి మెప్పించారు.
9.లాల్ – సిమ్రాన్
కార్తికేయన్ హీరోగా నటించిన సీమ రాజు సినిమాలో నటుడు లాల్ విలన్ గా నటించగా.ఆయన భార్యగా సిమ్రాన్ నటించి వావ్ అనిపించారు.