అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే మన కుర్రాళ్లు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి( NR Narayana Murthy ) కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.మనదేశంలో ఇప్పటికీ 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారని.
అంటే వాళ్లంతా పేదరికంలో ఉన్నట్లే కదా అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.వారానికి 70 గంటలు పనిచేయకుంటే పేదరికాన్ని మనదేశం ఎలా అధిగమిస్తుందని ఆయన ప్రశ్నించారు.
దీనిపై అప్పట్లోనే కార్పోరేట్ ప్రపంచం, యువత రకరకాలుగా స్పందించిన సంగతి తెలిసిందే.
మరికొద్దిరోజుల్లో 2024కి ఎండ్ కార్డ్ పడుతున్న దశలో మరోసారి నారాయణ మూర్తి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
పనిగంటల పొడిగింపుకి సంబంధించి నారాయణ మూర్తి అభిప్రాయాలను సమర్ధించిన వారిలో ఓలా సీఈవో భవిష్ అగర్వాల్( OLA CEO Bhavish Aggarwal ) కూడా ఉన్నారు.మూర్తి, అగర్వాల్ ఇద్దరూ మెరుగైన భారతదేశాన్ని నిర్మించడానికి ఎక్కువ పనిదినాలు ఉండాల్సిన అవసరం ఉందని బలంగా చెబుతున్నారు.
కానీ కొన్ని సెక్షన్లు మాత్రం వీరిద్దరిపై విమర్శలు చేస్తున్నాయి.
తక్కువ వేతనం పొందే ఉద్యోగులు నిద్రను కోల్పోవాల్సి ఉంటుందని, అలాంటప్పుడు అదనపు గంటలను ఎందుకు లాగిన్ చేయాలని వారు ప్రశ్నించారు.ఇప్పటికే ఐటీ, ఐటీ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న వారి రోజువారీ పనిగంటలను( Workhours ) 14 గంటలకు పెంచాలని కొద్దిరోజుల క్రితం కర్ణాటక మంత్రివర్గం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ ప్రతిపాదనపై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ఇదే సమయంలో పని సంబంధిత ఒత్తిడి కారణంగా ఒక ఉద్యోగి మరణించడంతో ఈ ప్రతిపాదన తీవ్ర చర్చనీయాంశమైంది.
ఓ వైపు ఉద్యోగులు మెరుగైన కార్మిక చట్టాలను డిమాండ్ చేస్తుండగా.మరోవైపు కొందరు సీఈవోలు మాత్రం ఎక్కువ పనిగంటలను పునరుద్ఘాటించారు.ఏఐ స్టార్టప్ గ్రెప్టైల్ సీఈవో( Greptile CEO ) భారత సంతతికి చెందిన దక్ష్ గుప్తా( Daksh Gupta ) వీరిలో ఒకరు.
ఈ మేరకు గత నెలలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది.ఆయన కూడా 14 గంటలకు పైగా పనిదినాలు ఉండాలని ఆకాంక్షించారు.దీంతో ఆన్‌లైన్‌లో ఆయనపై ట్రోలింగ్ జరిగింది.