క్యాన్సర్( Cancer ) లో ఎన్నో రకాలు ఉన్నాయి.అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ తో ప్రతి ఏడాది ఎందరో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు.బ్రెస్ట్ క్యాన్సర్ ( Breast cancer )అనేది రొమ్ము కణజాలంలో కలిగే కేన్సర్ రూపం.
ఇది సాధారణంగా డక్ట్స్(పాలు గుత్తులు) లేదా లోబ్యూల్స్ (పాలు ఉత్పత్తి చేసే గ్లాండ్స్) లో ప్రారంభమవుతుంది.బ్రెస్ట్ క్యాన్సర్ పురుషుల్లో కూడా రావొచ్చు.
కానీ ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది.ఇకపోతే భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.
ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష ( Oranges, lemons, grapes )వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా సెల్ డ్యామేజ్ మరియు క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.రెగ్యులర్ గా సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదరం 10 శాతం తగ్గిందని ఒక అధ్యయనంలో తేలింది.
ఆహారాలు ఆకుకూరలు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో గొప్పగా పని చేస్తాయి. బ్రోకొలీ, బచ్చలికూర, పాలకూర,( Broccoli, Spinach, Lettuce ) కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ కె, బీటా-కెరోటిన్, కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్ మరియు ఇతర ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కు దూరంగా ఉండాలనుకునేవారు వారానికి ఒకసారి చేపలను తీసుకోండి.చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు( Omega-3 fatty acids ) పుష్కలంగా ఉంటాయి.ఇవి అసాధారణ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
అదనంగా చేపల ద్వారా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలను కూడా పొందొచ్చు.పసుపు, అల్లం, దాల్చిన చెక్క వంటి మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తాయి.ఇవే కాకుండా గ్రీన్ టీ, నట్స్, టమాటో, క్యాప్సికమ్, యాపిల్, బ్లూబెర్రీ, పాలు, పాల ఉత్పత్తులు, వెల్లుల్లి, ఉల్లి, ఓట్స్, బార్లీ, క్వినోవా మరియు బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.