ఇటీవల కాలంలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోలతో తలకెక్కించడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతూ ఉన్నారు.అయితే సినిమా ఎంత బాగా తెరకెక్కించినప్పటికీ ఒకవేళ ప్రేక్షకులకు నచ్చకపోతే మాత్రం నష్టాలు తప్పవు అన్న విషయం తెలిసిందే.
అయితే సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన అటు మినిమం గ్యారంటీ హీరోలు ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు.అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నిర్మాతలకు మాత్రం నష్టాలు రావడం చాలా తక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఇలా సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన సత్తా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉంది అని చెప్పాలీ.
డాలి దర్శకత్వంలో వచ్చిన గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి.ఇక పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన కాటంరాయుడు అంచనాలను అందుకోలేకపోయింది.
కానీ బాక్స్ ఆఫీస్ వద్ద 89 కోట్లు రాబట్టింది.అయితే తొలిరోజే ఈ సినిమా 50 కోట్లకు పైగా రాబట్టడం గమనార్హం.
దాదాపు 10 ఏళ్లకు పైగా ఒక్క హిట్టు వస్తే చాలు అని నిరీక్షణగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానుల ఆఖలీ తీర్చిన సినిమా గబ్బర్ సింగ్.హరిష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.అయితే గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా పవన్ రాసుకున్న కథను బాబీ దర్శకత్వం వహించగా భారీ అంచనాల మధ్య వచ్చి ఇక్కడ డిజాస్టర్ అయింది ఈ సినిమా.కానీ బాక్సాఫీస్ వద్ద 92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయట.
మొదటి రోజే 50 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.ఇక పవన్ కళ్యాణ్ మాటలు మంత్రి కూడా త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయ్యింది.
కానీ డిజాస్టర్ టాక్ తో కూడా 95 కోట్లు గ్రాస్ రాబట్టింది.అయితే ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోల హిట్ సినిమాలు కూడా ఇంత కలెక్షన్స్ రాబట్టకపోవడం గమనార్హం.