నిమ్మ పండ్లు.దాదాపు అందరి ఇళ్లల్లోనూ వీటిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు.
అయితే నిమ్మ పండ్ల విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.వాటి లోపల ఉండే గింజలను పారేయడం.
నిమ్మ గింజలు ఎందుకు పనికి రావని అనుకోవడమే అందుకు కారణం.కానీ, నిమ్మ గింజల గురించి ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుటే.
వాటిని తినకుండా ఉండలేరు.అవును, నిమ్మ గింజలు రుచికి చేదుగా ఉన్నప్పటికీ.
అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.మరి లేటెందుకు ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
నిమ్మ గింజల్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది.అది నొప్పి నివారిణిగా పని చేస్తుంది.
అందుకే తలనొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి వచ్చినప్పుడు నాలుగు నిమ్మ గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి.ఆపై ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.
ఇలా చేస్తే ఆయా నొప్పుల నుంచి సహజంగానే ఉపశమనం పొందొచ్చు.

కడుపులో నులి పురుగులు ఉన్న వారికి నిమ్మ గింజలు ఓ వరమనే చెప్పాలి.అవును, రోజుకు ఒకసారి నిమ్మ గింజలను నమిలి తింటే.కడుపులో నులి పురుగులు త్వరగా నాశనం అవుతాయి.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారించే సామర్థ్యం కూడా నిమ్మ గింజలకు ఉంది.నిమ్మ గింజలు శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
అందువల్ల, వీటిని తరచూ తీసుకుంటే ఇన్ఫెక్షన్ తొలగిపోయి యూరినరీ ట్రాక్ శుభ్రపడుతుంది.అంతేకాదు, నిమ్మ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో మలనాలు తొలగిపోతాయి.
లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మరియు క్యాన్యర్ కణాలు వృద్ధి చెందకుండా కూడా ఉంటాయి.
అయితే నిమ్మ గింజలు మంచిది కదా అని అతిగా తిన్నారో రిస్క్‌లో పడటం ఖాయం.అందువల్ల, రోజుకు నాలుగు గింజలను మించకుండా తీసుకుంటే పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీ సొంతం అవుతాయి.







