నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.పరిశ్రమలో కన్వేయర్ బెల్ట్ తెగి ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
దీంతో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని.అదేవిధంగా మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.