కరోనా బాధితుల కోసం సరికొత్తగా ఆలోచించిన హైదరాబాద్ హోటళ్లు!

కాలం కరోనా కాలం అయ్యింది.ఈ కాలంలో అందరూ ఆర్ధికంగా మునిగిపోయారు.

 Hyderabad Hotels,  Special Food, Covid-19 Victims, Corona Virus-TeluguStop.com

బిజినెస్ లు పడిపోయాయి.ఇంకా అలానే దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్ల బిజినెస్ కూడా అమాంతం పడిపోయింది.

పచ్చడి మెతుకులో, పరమాన్నామో ఇంట్లోనే చేసుకొని తినడం మంచిది.బయట తింటే కరోనా ప్రమాదం తప్పదు అని ప్రజలు ఫిక్స్ ఇంటి ఫుడ్ కే పరిమితం అయ్యారు.

అయితే కరోనా రానంత వరకు ఓకే.వస్తే ఏంటి? అని.కరోనా వైరస్ వచ్చిన సమయంలో కొందరు ఆస్పత్రులకు వెళ్తే.మరికొందరు ఇంటి వద్దనే ఉంటున్నారు.

అయితే హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం.ఇంకా అలాంటి పౌష్టికాహారం కరోనా భాదితులకు అందిస్తాం అని విన్నూత ఆలోచనతో హైదరాబాద్ లోని కొన్ని హోటళ్లు ముందుకు వచ్చాయి.

కరోనా పేషేంట్ల కోసం ఫుడ్ ప్యాకేజీలనే అందుబాటులోకి తీసుకువచ్చారు.కోవిడ్ బాధితులకు విటమిన్లు, పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం అవసరం.ఇంకా అలాంటి ఆహారాన్నే వారు 14 రోజులకు తగ్గట్టు అందిస్తున్నారు.ఇలా 14 రోజులకు అందించే ఆహారానికి 8 వేల రూపాయిలు బిల్ వేస్తున్నారు.

అంత డబ్బులు చాలా ఎక్కువ అని మనకు అనిపించినప్పటికీ అంతకంటే ఎక్కువ ధర ఆహారాన్ని వారు అందిస్తున్నారు.

ఉదయం టిఫిన్, పాలు, జ్యూస్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్డు, వాటర్ బాటిల్‌ను తీసుకొచ్చి కరోనా బాధితుల ఇంటి ముందుంచి ఫోన్ చేస్తారు.

ఇంకా లంచ్, డిన్నర్‌లలోనూ పోషకాలతో కూడిన ఆహారం అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ బిజినెస్ ఐడియాను హైదరాబాద్ లోని ఎన్నో హోటల్స్ వారు విచ్చలవిడిగా వాడేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube