అరటి తొక్కతో డార్క్ నెక్ కి చెప్పండి బై బై..!

సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉంటే మెడ మాత్రం నల్లగా కనిపిస్తుంటుంది.హార్మోన్ల అసమతుల్యత, పలు రకాల మందుల వాడకం, ప్రెగ్నెన్సీ, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఒంట్లో అధిక వేడి తదితర కారణాల వల్ల నెక్ అనేది డార్క్ గా మారుతుంది.

 Say Goodbye To Dark Neck With A Banana Peel! Banana Peel, Banana Peel Benefits,-TeluguStop.com

మీరు కూడా డార్క్ నెక్ తో బాధపడుతున్నారా.? ఈ సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

అరటి తొక్క ఎందుకు పనికిరాదని డస్ట్ బిన్ లోకి తోసేస్తూ ఉంటాం.

కానీ అరటి పండులోనే( Banana fruit ) కాదు తొక్కలోనూ ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అరటి తొక్కతో పలు ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా డార్క్ నెక్ సమస్యను ( Dark neck problem )దూరం చేయడంలో అరటి తొక్క తోడ్ప‌డుతుంది.మరి ఇంతకీ అరటి తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

Telugu Bananapeel, Tips, Dark Neck, Latest, Neck, Goodbyedark, Skin Care, Skin C

ముందుగా అరటి తొక్కలో నుంచి చిన్న బైట్ ను కట్ చేయండి.ఇప్పుడు కట్ చేసిన అరటి తొక్క లోప‌లి వైపు మీద‌ హాఫ్ టీ స్పూన్ కాఫీ పొడిని( Coffee powder ) చల్లండి.అలాగే హాఫ్ టీ స్పూన్ బియ్యం పిండి( rice flour ) మరియు వన్ టీ స్పూన్ తేనె వేసి మెడకు రబ్ చేయండి.మూడు నుంచి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మెడ చుట్టూ అరటి తొక్కతో స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా నెక్ ను క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేశారంటే వారం లోనే మీరు రిజల్ట్ ను గమనిస్తారు.

ఈ సింపుల్ రెమెడీ మెడ నలుపును క్రమంగా మాయం చేస్తుంది.మెడను తెల్లగా మృదువుగా మారుస్తుంది.

కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

Telugu Bananapeel, Tips, Dark Neck, Latest, Neck, Goodbyedark, Skin Care, Skin C

అరటి తోకను నేరుగా కూడా మెడకు ఉపయోగించవచ్చు.అరటి తొక్క లోపల భాగాన్ని డార్క్ గా ఉన్న నెక్ పై ఐదు నిమిషాల పాటు వృత్తాకార కదలికతో బాగా రబ్ చేయాలి.ఆపై 15 నిమిషాల పాటు మెడను వదిలేసి అప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ చిట్కాను పాటించిన కూడా మెడ నలుపు మాయం అవుతుంది.అరటి తొక్క చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube