అన్ని పండ్ల మాదిరిగా జామపండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.ప్రతి రోజు ఒక జామపండు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.
అయితే కొందరు దగ్గు ,జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, జామ పండు తినడం వల్ల మరింత ఎక్కువ అవుతుందని చెబుతుంటారు.జామ పండు తినడం వల్ల నిజంగానే జలుబు చేస్తుందా? అని చాలామంది అనుమాన పడుతుంటారు.అయితే జామపండును తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.ప్రతిరోజు ఒక జామపండును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.
జామపండు చాలా చౌకగా విరివిగా లభించే పండ్లలో ఒకటి.ఇలాంటి జామపండ్లు లో ఎన్నో పోషక విలువలు, ప్రోటీన్లు, ఫైబర్ ,విటమిన్స్, క్యాల్షియం ఐరన్ వంటివి జామపండు లో విరివిగా లభిస్తాయి.
జామపండును తినడం వల్ల అందులో ఉన్న ఫైబర్ మన శరీరంలోని మెటబాలిజంను పెంచడమే కాకుండా, మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతో దోహదపడుతుంది.

టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారు ప్రతిరోజు జామపండును తినడం వల్ల, డయాబెటిస్ నుంచి విముక్తి కలుగుతుంది.ఈ పండును తినడానికి వారు ఎటువంటి సంకోచం చెందవలసిన అవసరం లేదు.జామ పండులో ఉండే విటమిన్లు, క్యాల్షియం వంటి లవణాలు మన శరీరంలో ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడతాయి.
జామ పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇన్ని పోషక విలువలు కలిగిన జామపండు తీసుకోవడం వల్ల జలుబు ,దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.
ఒక జామపండులో నే కాకుండా, జామ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.
పంటి నొప్పితో బాధపడే వారు జామ ఆకులను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని పుక్కలించడం వల్ల చిగుళ్ళు వాపు సమస్యలు, దంతాల సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
అంతే కాకుండా ప్రతి రోజు లేత జామ ఆకులను నమలడం వల్ల మన నోటిలో ఉండే దుర్వాసన పోయి, మన నోరు తాజాగా, శుభ్రంగా తయారవుతుంది.ప్రతిరోజు జామపండును తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.