దేశంలో జరిగిన రెండు భయంకరమైన రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు కెమెరాలో రికార్డ్ అయ్యి అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.వీటిలో ఒకటి మహారాష్ట్రలో జరిగితే, మరొకటి కర్ణాటకలో( Karnataka ) జరిగింది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.వేగంగా వస్తున్న కారు ఒక మహిళను హైవే దాటుతుండగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది.ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవ్వగా, X యూజర్ @VishooSingh దీన్ని షేర్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో… ఓ మధ్య వయస్కురాలైన మహిళ రద్దీగా ఉండే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది.ఆమె నెత్తిన స్టీల్ బిందె ఉంది.పాదచారుల కోసం ఏర్పాటు చేసిన రోడ్డు పక్కన ఉన్న బారికేడ్ల గ్యాప్ దగ్గరికి ఆమె జాగ్రత్తగా చేరుకుంది.నెమ్మదిగా రోడ్డు దాటడానికి ఆమె అడుగు ముందుకు వేయగానే, ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చిన తెల్లటి ఎస్‌యూవీ ఆమెను ఢీకొట్టింది.
ఆ ఢీ కొట్టిన వేగానికి ఆమె ఎగిరిపడింది.ఆమె నెత్తిన ఉన్న బిందె డివైడర్ కి తగిలి నుజ్జునుజ్జు అయింది.
ఆ మహిళ ఎగిరి కారు ముందు భాగంపై మూడు సార్లు పల్టీలు కొట్టి కింద పడిపోయింది.

ఇంత భయంకరమైన యాక్సిడెంట్ చేసిన కారు అస్సలు ఆగకుండా వేగంగా దూసుకుపోయింది.అదంతా చూస్తున్న బైకర్లు షాక్ లో ఉండిపోయారు.కారు ముందు భాగం బాగా దెబ్బతింది.
పోలీసులు ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, కర్ణాటకలో మరో వేరే ప్రమాదం జరిగింది.
చళ్ళకెరె (Challakere) నుండి బళ్ళారి (Ballari) వెళ్లే NH 150A హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం… ఒక కారు డివైడర్ ని బలంగా ఢీకొని దాదాపు 15 సార్లు పల్టీలు కొట్టింది.
కారు పల్టీలు కొడుతున్నప్పుడు, అందులో ఉన్న ఒక ప్రయాణికుడు బయటకు ఎగిరిపడ్డాడు.

చనిపోయిన వారిని మౌలా (Maula) (35), రెహమాన్ (Rehman) (35) గా గుర్తించారు.వీరిద్దరూ యాద్గిర్ (Yadgir) జిల్లాకు చెందినవారు.ప్రమాదం జరిగిన చోటే వీరు ప్రాణాలు కోల్పోయారు.
డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం.ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంతమంది ఉన్నారో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
యాక్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ రెండు ఘటనలూ.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి నిదర్శనం.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి.







