ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?

సాధార‌ణంగా ప‌సి బిడ్డ‌ల సున్నిత‌మైన శరీరంపై పుట్టినప్పటి నుండీ అవాంఛిత జుట్టు కాస్త అధికంగానే ఉంటుంది.ఆ జుట్టును అలానే వ‌దిలేస్తే శిశువుకు ప‌లు ర‌కాల ఇన్ఫెక్షన్  సోకే ప్ర‌మాదం ఉంటుంది.

 Do You Know How To Remove Unwanted Hair From Baby Body Details, Unwanted Hair, B-TeluguStop.com

అందుకే వాటిని తొల‌గిస్తుంటారు.కానీ, కొంద‌రు త‌ల్లుల‌కు ఈ విష‌యంపై పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు.

అస‌లు శిశువు శ‌రీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొల‌గించాలో కూడా వారికి తెలియ‌దు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే గ‌నుక చాలా అంటే చాలా సుల‌భంగా ఆ వెంట్రుకలను తొలగించవచ్చు.

మ‌రి ఆల‌స్యం ఎందుకు ఆ చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పెస‌ర పిండి, ఒక స్పూన్ గోధుమ పిండి, మూడు స్పూన్ల పాల మీగ‌డ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

బిడ్డ ఒంటికి త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అప్లై చేసి.స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో సున్నితంగా రుద్దాలి.ఆపై స్నానం చేయించాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే అవాంచిత జుట్టు క్ర‌మంగా తొల‌గి పోతోంది.

అలాగే అర క‌ప్పు ఓట్స్‌లో ఆరు జీడిప‌ప్పులు, ఆరు పొట్టు తీసిన బాదం ప‌ప్పు వేసి మెత్త‌టి పౌడ‌ర్‌లా మిక్సీ ప‌ట్టుకుని ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.

Telugu Baby, Baby Skin, Latest, Skin Care, Skin Care Tips, Un-Telugu Health

ప్ర‌తి రోజు ఈ పౌడ‌ర్‌లో కొద్దిగా ప‌చ్చి పాలు, ఒక స్పూన్ ఇంట్లో త‌యారు చేసుకున్న గులాబీ రేకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని బిడ్డకు స్నానం చేయించ‌డానికి ముందు ప‌ట్టించి.స్మూత్‌గా రుద్దాలి.

ఇలా రోజూ చేస్తే అవాంఛిత జుట్టు ఊడిపోవ‌డ‌మే కాదు.శిశువు యొక్క శ‌రీరం మృదువుగా కూడా మారుతుంది.

ఇక రెండు స్పూన్ల ఆల్మండ్ ఆయిల్‌కు, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను క‌లిపి బిడ్డ శ‌రీరానికి ప‌ట్టించి బాగా మ‌సాజ్ చేయాలి.రెగ్యుల‌ర్‌గా స్నానం చేయించ‌డానికి గంట ముందు ఇలా చేసినా అవాంఛిత వెంట్రుక‌లు ఊడిపోయి.

చ‌ర్మం కోమ‌లంగా త‌యారు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube