మొటిమలు.ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీయడంలో ఇవి ముందు వరసలో ఉంటాయి.
అందుకే మొటిమలు వచ్చాయంటే వాటిని ఎలాగైనా నివారించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటాయి.మార్కెట్‌లో దొరికే ఖరీదైన క్రీములు, సీరమ్‌లు వాడుతారు.
అయినా ఫలితం లేకుంటే లేజర్ ట్రీట్‌మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ, ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే.
రెండంటే రెండే రోజుల్లో మొటిమలను పోగొట్టుకోవచ్చు.మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ గంధం పొడి మరియు కొద్దిగా గ్లిజరిన్ వేసుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోటు అప్లై చేసి ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రంగా చర్మానికి క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల పాటు చేస్తే ఎటువంటి మొటిమలైనా పరార్ అవుతాయి.
అలాగే బంతి పూలతోనూ మొటిమలను తగ్గించుకోవచ్చు.అందు కోసం ముందుగా కొన్ని బంతి పూల రేఖలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ పేస్ట్‌లో అర స్పూన్ ఆల్మండ్ ఆయిల్, ఆర స్పూన్ హనీ వేసుకుని కలిపి.మొటిమలపై పూయాలి.
పది హేను నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మొటిమలు తగ్గుతాయి.

ఇక గంజితోనూ మొటిమలను నివారించుకోవచ్చు.ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ గోధుమ పిండి, చిటికెడు కస్తూరి పసుపు సరిపడా గంజి వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి.ఆరిన తర్వాత వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చలూ పోతాయి.