Jojoo George : బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇరట్ట నటుడు.. తెలుగు లో కళ్ళు చెదిరే పారితోషకం

జోజు జార్జ్ ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఇతని పేరు వినిపిస్తుంది ఒక డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జార్జ్ తెలుగు సినిమాల్లో కూడా నేరుగా కనిపించబోతున్నాడు.ఇరట్ట సినిమా తర్వాత జోజూ జార్జ్(Joju George) గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.

 Joju Jeorge Remuneration In Tollywood-TeluguStop.com

అతని పర్ఫామెన్స్ సినిమాని అతను తీసుకెళ్లిన విధానం దర్శకుడు ప్రతిభ వెరసి ఒక అద్భుతమైన ఆ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కొనసాగింది.సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చాలాసేపు అదే కథలో ప్రయాణం చేస్తాడు అంతలా హృదయాలను హత్తుకుంది ఇరట్ట(Iratta) కథ.వయసు మీటిన ఒక నటుడు కూడా సినిమాలు ఇంత బాగా ప్రజెంట్ చేయగలగడమే ఈ చిత్రం విజయానికి ముఖ్య కారణం.హీరో హీరోయిజం కాకుండా నెగటివ్ లక్షణాలతో కూడా కథను నిలబెట్టడం మరొక విశేషం.

Telugu Iratta, Joju George, Joju Jeorge, Vaishnav Tej-Movie

ఏది ఏమైనా ఆ రెండు పాత్రలలో జోజు జార్జ్ నటించిన విధానం అయితే అనీర్వచనీయం అనే చెప్పవచ్చు.ఇక వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)తాజా సినిమా కోసం జార్జ్ ని విలన్ పాత్రలో నటించాలని అడగగా అతడు ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషకం డిమాండ్ చేశాడట.ఒక విలన్ పాత్ర దానికి ఇంత మొత్తంలో ఇవ్వడం చాలా అరుదు అయినా కూడా నటించే ఒకే ఒక్క సినిమాతో కోటిన్నర పారితోషకం తీసుకుంటున్నాడు అంటే అతడికి అంత వర్క్ ఉందనే కదా అర్థం ఖచ్చితంగా జోజు జార్జ్ కి కోటిన్నర పారితోషకం ఇవ్వవచ్చు.ఒక చిన్న పల్లెటూరులో ఉన్న పోలీస్ స్టేషన్లో చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

గతంలోనే ఈ సినిమా గురించి మనం కొన్ని ఆర్టికల్స్ కూడా రాశాం.

Telugu Iratta, Joju George, Joju Jeorge, Vaishnav Tej-Movie

ఇక జోజు జార్జ్ సంగతి పక్కన పెడితే మలయాళీ నటులకు తెలుగు సినిమాల్లో డిమాండ్ పెరుగుతూ వస్తోంది.గత కొన్ని రోజులుగా మలయాళ సినిమాలకు(Malayalam movies) మాత్రమే కాదు అక్కడ నటులకు డిమాండ్ ఉంది ప్రతి చిత్రం రీమేక్ సినిమాగా ఇక్కడికి పట్టుకొస్తున్న తెలుగు వారు ఇక నేరుగా నటులను దింపడం మొదలుపెట్టారు.కేవలం తెలుగులోనే కాదు మలయాళీ నటుల మరియు కథల డిమాండ్ అన్ని భాషలకు పాకుతుంది ఇండియన్ సినిమా చరిత్రలోనే మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube