Jojoo George : బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇరట్ట నటుడు.. తెలుగు లో కళ్ళు చెదిరే పారితోషకం

జోజు జార్జ్ ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఇతని పేరు వినిపిస్తుంది ఒక డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జార్జ్ తెలుగు సినిమాల్లో కూడా నేరుగా కనిపించబోతున్నాడు.

ఇరట్ట సినిమా తర్వాత జోజూ జార్జ్(Joju George) గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.అతని పర్ఫామెన్స్ సినిమాని అతను తీసుకెళ్లిన విధానం దర్శకుడు ప్రతిభ వెరసి ఒక అద్భుతమైన ఆ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కొనసాగింది.

సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చాలాసేపు అదే కథలో ప్రయాణం చేస్తాడు అంతలా హృదయాలను హత్తుకుంది ఇరట్ట(Iratta) కథ.

వయసు మీటిన ఒక నటుడు కూడా సినిమాలు ఇంత బాగా ప్రజెంట్ చేయగలగడమే ఈ చిత్రం విజయానికి ముఖ్య కారణం.

హీరో హీరోయిజం కాకుండా నెగటివ్ లక్షణాలతో కూడా కథను నిలబెట్టడం మరొక విశేషం.

"""/" / ఏది ఏమైనా ఆ రెండు పాత్రలలో జోజు జార్జ్ నటించిన విధానం అయితే అనీర్వచనీయం అనే చెప్పవచ్చు.

ఇక వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)తాజా సినిమా కోసం జార్జ్ ని విలన్ పాత్రలో నటించాలని అడగగా అతడు ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషకం డిమాండ్ చేశాడట.

ఒక విలన్ పాత్ర దానికి ఇంత మొత్తంలో ఇవ్వడం చాలా అరుదు అయినా కూడా నటించే ఒకే ఒక్క సినిమాతో కోటిన్నర పారితోషకం తీసుకుంటున్నాడు అంటే అతడికి అంత వర్క్ ఉందనే కదా అర్థం ఖచ్చితంగా జోజు జార్జ్ కి కోటిన్నర పారితోషకం ఇవ్వవచ్చు.

ఒక చిన్న పల్లెటూరులో ఉన్న పోలీస్ స్టేషన్లో చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

గతంలోనే ఈ సినిమా గురించి మనం కొన్ని ఆర్టికల్స్ కూడా రాశాం. """/" / ఇక జోజు జార్జ్ సంగతి పక్కన పెడితే మలయాళీ నటులకు తెలుగు సినిమాల్లో డిమాండ్ పెరుగుతూ వస్తోంది.

గత కొన్ని రోజులుగా మలయాళ సినిమాలకు(Malayalam Movies) మాత్రమే కాదు అక్కడ నటులకు డిమాండ్ ఉంది ప్రతి చిత్రం రీమేక్ సినిమాగా ఇక్కడికి పట్టుకొస్తున్న తెలుగు వారు ఇక నేరుగా నటులను దింపడం మొదలుపెట్టారు.

కేవలం తెలుగులోనే కాదు మలయాళీ నటుల మరియు కథల డిమాండ్ అన్ని భాషలకు పాకుతుంది ఇండియన్ సినిమా చరిత్రలోనే మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

CM Jagan : రెండో రోజు బస్సు యాత్రలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!