మన జాతక చక్రంలో గ్రహాల సంచారం సరిగా లేకపోతే ఎన్నో రకరకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.అయితే వాటి సంచారం ఎలాగున్నా కూడా కొన్ని పనులు చేసే వారిపై నవగ్రహాలు ఆగ్రహం( Navagrahas ) వ్యక్తం చేస్తాయి అని మన వేద పండితులు చెబుతున్నారు.
అయితే ప్రత్యక్ష నారాయణడిగా పూజలు అందుకునే సూర్యభగవానుడికి పితృదేవతలను దూషిస్తే చాలా కోపం వస్తుంది.అలాగే నమస్కార ప్రియుడు తర్పణ గ్రహీతగా చెప్పే సూర్యుడికి పెద్దలను దూషిస్తే ఆగ్రహం వస్తుంది.
ఈ పనులు చేస్తే సూర్య భగవానుడికి( Lord surya ) ఆగ్రహం వస్తుంది.అలాగే సూర్య దేవుని ఎదురుగా మలమూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదు.
ఇలా చేస్తే సూర్య భగవానుడి ఆగ్రహానికి గురవుతారు.అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అని చెబుతూ ఉంటారు.
కాబట్టి అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, వెక్కిరించడం, వింతవింత హావభావాలు ప్రదర్శించడం లాంటివి చేయకూడదు.ఇలా చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
ఇక అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోతే కుజుడికి కోపం వస్తుంది.
ఇక మరి ముఖ్యంగా వ్యవసాయ పనులను సంబంధించి మోసం చేస్తే కుజుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
ఇక చాలామంది నోట్లో వేలు పెట్టుకోవడం, ముక్కులో వేలు పెట్టుకోవడం, అలాగే చెవిలో వేలు పెట్టుకుంటారు.ఇలా చేస్తే బుద్ధుడికి చాలా ఆగ్రహం వస్తుంది.అలాగే వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, తెలివైనోడిని అని విర్రవీగిన బుద్ధుడికి ఆగ్రహం వస్తుంది.ఇక దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి తమ గురువుని ఎవరైనా కించపరిస్తే చాలా ఆగ్రహం వస్తుంది.
అందుకే గురువుని పూజిస్తే, గౌరవిస్తే మాత్రం గురువు అనుగ్రహిస్తాడు.ఇక భార్య, భర్త మధ్య సంబంధం సరిగా లేకున్నా ఒకరినొకరు అగౌరవం పరుచుకున్న శుక్రుడుకి అస్సలు నచ్చదు.
అలాగే సుచి శుభ్రత లేని ఇల్లు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపైన శుక్రుడికి ఆగ్రహం ఉంటుంది.ఇక శని( Lord shani ) కారణంగా ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఏదో దశలో బాధపడాల్సి తప్పదు.ఎందుకంటే జీవితకాలంలో శని నుంచి తప్పించుకోలేరు.పెద్దల్ని కించపరిచినా, మరుగుదొడ్లు శుచిగా ఉంచిన, తల్లిదండ్రులను చులకన చూసిన శని ఆగ్రహం ఉంటుంది.ఇక వైద్య వృత్తి పేరుతో మోసం చేస్తే రాహువుకు ఆగ్రహం వస్తుంది.అలాగే పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యక్రమాలు చేయకపోతే కేతువు కోపిస్తాడు.
DEVOTIONAL