మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం నిత్యం మన ఇంటిలో పూజ చేస్తూ దేవాలయాలను దర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం.ఎంతో మంది భక్తులు ఎన్నో కోరికలను వెంటబెట్టుకుని దేవాలయాలను దర్శిస్తుంటారు.
అయితే గుడిలోకి ప్రవేశించగానే భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మనం చూస్తూ ఉంటాం.అలా గుడి చుట్టూ ఎన్ని ప్రదిక్షణలు చేయాలి.
ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతాము.గుడి చుట్టూ ప్రదక్షణాలు చేసే తిరిగి ధ్వజస్తంభం దగ్గర చేరుకున్నప్పుడు ఒక ప్రదక్షిణ పూర్తవుతుందనే విషయం మనకు తెలిసిందే.
ఇలా కొంతమంది గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు, తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.అంతే కాకుండా మరికొంతమంది మన ఇంటిలో పూజ గదిలో పూజ నిర్వహించుకొని ఆత్మ ప్రదక్షిణలు చేసుకుంటాము.

ఏ దేవాలయంలో నైనా తప్పకుండా ప్రతి ఒక్కరు మూడు ప్రదక్షిణలు చేస్తారు.అలాగే నవగ్రహాలకు సాధారణంగా మూడు ప్రదక్షిణలు చేస్తారు.గ్రహ దోషాలు ఉన్న వారు ఆ దోషాలను బట్టి 9, 11, 21 ప్రదక్షణలు చేస్తూ ఉంటారు.ఆంజనేయస్వామి దేవాలయంలో దర్శించిన వారు కనీసం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా భయం, పీడకలలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
అదేవిధంగా శివుడి ఆలయాలను దర్శించినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేయకూడదు.శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం చేయాలి.
అదే విధంగా అమ్మవారి ఆలయాలను సందర్శించినప్పుడు భక్తులు మూడు లేదా 9 ప్రదక్షిణలను చేయాలి.అదేవిధంగా వెంకటేశ్వరస్వామి, గణపతి, సాయిబాబా వంటి దేవాలయాలలో 9,11 ప్రదక్షణలు చేస్తారు.
ప్రదక్షిణలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నపుడు మనస్సును, మన ధ్యాస అంతా కూడా ఆ దేవుని పై ఉంచి దేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ఓంకారం లేదా గర్భగుడిలో ఉన్నటువంటి దేవుని నామస్మరణ చేస్తూ నెమ్మదిగా, ఇతరులను తాకకుండా, ఇతర ఆలోచనలు మన మనసులోకి రాకుండా, ఆ భగవంతుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి.
ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.