మన దేశ వ్యాప్తంగా దసరా ( Dussehra )నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా, వైభవంగా జరిగాయి.అమ్మవారిని ప్రాంతాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజిస్తూ ఉంటారు.
ఎలా పూజించిన అమ్మవారు మాత్రం ఒక్కటే అని పండితులు చెబుతున్నారు.ఒక్క రోజు ఒక్క రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు.
ఈ నవరాత్రుల్లో ఏ గుడి చూసినా మహిళా భక్తులతో రద్దీగా కనిపించింది.అలాగే కుంకుమ, పూజలు, హోమాలు వంటి పూజలతో దేవాలయాలన్నీ రద్దీగా కనిపించాయి.
అమ్మవారు తమను కరుణించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు.ఇంకొందరు అదే సమయంలో భవాని మాలలు కూడా వేసుకుని తమ కష్టాలన్నీ దూరం అవ్వాలని వేడుకున్నారు.

అలాగే దుర్గమ్మ ( Durgamma )తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు.కాబట్టి ఈ నవరాత్రులలో ఎంతో నియమ నిష్ఠలతో అమ్మవారిని కొలిచారు.అయితే ఈ దేవీ శరన్నవరాత్రుల్లో కొన్ని కలలు వస్తే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఆ కలలు వస్తే దుర్గామాత అనుగ్రహంతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెబుతున్నారు.
మరి ఆ కలలో ఏంటి,వాటి నుంచి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మ తల్లి విగ్రహం కనిపిస్తే ఎంతో మంచిది.

ఈ కల మీకు వచ్చి ఉంటే దుర్గాదేవి అనుగ్రహం లభించిందని అర్థం చేసుకోవచ్చు.అలాగే సింహ వాహనంపై అమ్మవారు స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే మీరు అనుకున్న పనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు.అంతేకాకుండా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.అలాగే అమ్మవారి అలంకరణ వస్తువులు అంటే గాజులు, కుంకుమ, పసుపు, ఎరుపు రంగు వంటి వస్తువులు కనిపిస్తే మీ సమస్యలకు ముగింపు దొరికినట్లే అని భావించవచ్చు.
అలాగే ఏనుగు పై దుర్గమ్మ తల్లి స్వారీ చేస్తున్నట్లు కల వస్తే విజయానికి సంకేతం అని భావించవచ్చు.కలలో పాలు, పాల ఉత్పత్తులు కనిపించడం వల్ల విజయంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందనీ చెబుతున్నారు.