టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం విజయ్ సినిమాలలో నటిస్తు బిజీ బిజీగా ఉన్నారు.
ఇకపోతే విజయ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో , హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కొత్త కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
ఇక ఇటీవలే పూరి జగన్నాథ్ తో జేజిఎమ్ అనే సినిమాను ప్రారంభించిన విజయ్ దేవరకొండ ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే మరో చిత్రాన్ని మొదలు పెట్టేశారు.
దర్శకుడు శివ నిర్వాణ తో కలసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంతా హీరోయిన్ గా నటించబోతోంది.ఇక ఈ సినిమాకు షూటింగ్ తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెట్టారు.అయితే హీరోయిన్ సమంత దుబాయ్ లో ఒక కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొనడం వల్ల ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన లేకపోయింది.దీంతో విజయ్ దేవరకొండ ఓపెనింగ్ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.

ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ పబ్లిసిటీ ఈ విధంగా కూడా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ కాశ్మీర్ వెళ్ళాడు.ఈ క్రమంలోనే కాశ్మీర్ కీ వెళ్లడానికి ముందు హైదరాబాదులో ఎయిర్ పోర్ట్ లో హల్ చల్ చేసాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సుప్రీమ్ అని రాసి వున్న బ్లాక్ టీషర్ట్,బ్లాక్ గాగుల్స్ ధరించి ఫుల్ స్వాగ్ తో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది.కశ్మీర్ లో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసి చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంటుందట.

మే ఎండ్ వరకు అక్కడే టీమ్ కీలక షెడ్యూల్ కోసం వుండనున్నారు అని ఆ తరువాత హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది.ఇక వైజాగ్ తో పాటు మరో చోట జరిపే షెడ్యూల్ తో సినిమాని పూర్తి చేయాని విజయ్ దేవరకొండ ప్లాన్ లో ఉండగా ఇదే విషయంలో హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ శివ నిర్వాణ కు కండీషన్స్ పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.చాలా తక్కువ టైమ్ లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి జేజీఎమ్ షూట్ కు వెళ్లాలి విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఆ ఆలోచనలో భాగంగానే దర్శకుడు శివ నిర్వాణకు కండీషన్స్ పెట్టారని తెలుస్తోంది.







