ప్రముఖ నిర్మాతలలో ఒకరైన బోనీ కపూర్( Boney Kapoor )వయస్సు ప్రస్తుతం 67 సంవత్సరాలు కాగా బోనీ కపూర్ నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే బోనీ కపూర్ ఒక పని వల్ల విమర్శల పాలవుతున్నారు.
బాలీవుడ్ మోడల్( Bollywood Model )నడుముపై చెయ్యి వేయడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు.ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ముసలోడే కానీ మామూలోడు కాదంటూ బోనీ కపూర్ ను నెటిజన్లు( Netizens ) దారుణంగా ట్రోల్ చేయడం గమనార్హం.నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ లో ఎక్కువ సంఖ్యలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.వరుణ్ ధావన్, ప్రియాంక చోప్రా, రణబీర్ సింగ్, షారుఖ్ ఖాన్ ఈ ఈవెంట్ కు హాజరు కావడం జరిగింది.
ఈ ఈవెంట్ కు హాలీవుడ్ ప్రముఖ మోడల్ జిగి అడిద్( Gigi Hadid )కూడా హాజరు కావడం జరిగింది.
జిగి హడిద్ బోనీ కపూర్ ను ప్రేమగా పలకరించగా ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఫోటోలు దిగడం జరిగింది.ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలో బోనీ కపూర్ నడుముపై చెయ్యి వేయడం గమనార్హం.జిగి హడిద్ తనపై చెయ్యి వేయడాన్ని క్యాజువల్ గానే తీసుకోవడం జరిగింది.
ఈ ట్రోల్స్(Trolls )గురించి బోనీ కపూర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.తమిళంలో బోనీ ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్నారు.
బోనీ కపూర్ తమిళంలో అజిత్<( Ajith )/em> తో ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్నారు.బోనీ కపూర్ తెలుగు సినిమాలను కూడా నిర్మించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువగా బోనీని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.బోనీ వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.