ప్రస్తుత సమాజంలో వివాహం కానీ అమ్మాయిలకు, కానీ అబ్బాయిలకు కానీ ఏ చిన్న ఫంక్షన్ కి వెళ్లిన, ఎక్కడ కనిపించినా పెళ్లి( Marriage ) ఎప్పుడు చేసుకుంటావు అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు నుంచి మూఢం మొదలైంది.
గ్రహయోగం, దోషం ఉన్న సమయం ఇదే కావడం వల్ల ఈ సమయాన్ని చెడు సమయం గా( Bad Time ) భావిస్తారు.అలాగే ఈ సమయన్ని ప్రతికూలంగా పరిగణిస్తారు.
దీంతో వివాహం వంటి శుభకార్యాలు ఎవరు జరుపుకోరని, వారు మూఢం దాటే వరకు అవ్వాల్సిందేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.సనాతన ధర్మం ప్రకారం గ్రహ స్థితి రాశుల కదలికలను బట్టి అందరికీ కొంత కాలం మూఢంగా( Moodham ) పరిగణిస్తారు.
గురు గ్రహం సూర్యునికి సమీపంలో ఉన్నప్పుడు, శుక్రుడు సూర్యునికి సమీపంలో ఉన్నప్పుడు మూఢంగా పరిగణిస్తారు.ఈ కాలంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించారు.ఆశ్వయుజ మాసంలో శుభకార్యాలు చేయడం మొదలుపెడతారు.

ఈ సారి కూడా అదే విధంగా పుష్య మాసం మినహా మిగిలిన కాలంలో అనేక శుభకార్యాలు జరిగాయి.ఇంకా చెప్పాలంటే వివాహం సమయంలో మార్కెట్లో అన్ని వస్తువుల రేట్లు ఎక్కువగా ఉంటాయి.వస్త్ర వ్యాపారం, బంగారం వ్యాపారం, హోటల్లు, బ్రాహ్మణులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది.
కానీ ఇప్పుడు మూఢం మొదలైంది.వివాహాలు ఇతర శుభకార్యాలు మరో మూడు నెలలు పాటు జరగవు.

ఈ రోజు నుంచి ప్రారంభమై ఆగస్టు 8వ తేదీ వరకు ఉంటుంది.హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు నెలల వరకు ఏలాంటి శుభకార్యాలు జరగవని పండితులు చెబుతున్నారు.కాదని ఈ రోజులలో వివాహాది శుభకార్యాలు చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.అలాగే ఇలా చేయడం అస్సలు మంచిది కాదని కూడా చెబుతున్నారు.