తెలంగాణ అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావాన్ని పెంచి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బిజెపిని అధికారానికి దూరం చేయడమే టార్గెట్ గా కేసిఆర్ ముందడుగు వేస్తున్నారు.
దీనిలో భాగంగానే తమకు బలం ఉన్న రాష్ట్రాలపై ముందుగా ఫోకస్ పెట్టారు.దీనిలో భాగంగానే ఏపీలోను బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలయ్యాయి .ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా గతంలో జనసేనలో కీలకంగా పనిచేసిన తోట చంద్రశేఖర్ ను నియమించారు.ఆయన నియామకం పైన అనేక విమర్శలు వ్యక్తం అవుతుండగా.
తాజాగా కాపు రిజర్వేషన్ కోసం దీక్ష చేపట్టిన మాజీ మంత్రి చేగుండి హరి రామ జోగయ్య ఏపీలో బీఆర్ఎస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో టీడీపీ జనసేన ఓట్లను చీల్చేందుకే బిఆర్ఎస్ పార్టీ అడుగుపెడుతోందని , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారని , అందుకే బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తుందని జోగయ్య అనుమానం వ్యక్తం చేశారు.
కేసీఆర్, జగన్ ప్లాన్ లో భాగంగానే ఇదంతా జరుగుతోందని జాతీయ పార్టీ గుర్తింపు ముసుగులో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసేందుకు ముందుకు వచ్చిందని జోగయ్య విశ్లేషించారు.

2019 ఎన్నికల్లో జగన్ కు కేసిఆర్ 700 కోట్లు నిధులు సమకూర్చారని, ఇప్పుడు కేసీఆర్ రుణం తీర్చుకునేందుకే జగన్ బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇచ్చినా, నోరు మెదపడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.టిడిపి జనసేన ఓట్లు లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడుతోందని విశ్లేషించారు.కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ తాను పోరాటానికి దిగిన నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎంట్రీ పై జోగయ్య అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ పై నోరు మెదప లేదు.







