న్యూస్ రౌండప్ టాప్ 20

1.మూడో రోజు బండి సంజయ్ యాత్ర

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర మూడో రోజు కేపీ హెచ్ పీ నుంచి ప్రారంభం అయ్యింది. 

2.విద్యుత్ బైక్ ల దహన ఘటనపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశం

  సికింద్రాబాద్ లో విద్యుత్ బైక్ ల షోరూం లో మంటలు చెలరేగి 8 మంది దుర్మరణం చెందిన ఘటనపై సమగ్ర విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

3.నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

నిజాం సాగర్ ప్రాజెక్టు కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. 

4.ఎం హెచ్ వో కోర్సు గడువు పెంపు

  నిమ్స్ లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో చేరేందుకు గడువు ను ఈ నెల 29 వరకు పొడగించినట్టు ఆసుపత్రి పరిపాలనా విభాగం అధికారి సత్యనారాయణ తెలిపారు. 

5.హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

హైదరాబాద్ తిరుపతి – నగర్ సోల్ యశ్వంత్ పూర్ మధ్య ఆరు  ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

6.బ్రాహ్మణ అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ

  గ్రూప్ 3, గ్రూప్ 4 , డీఎస్సీ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతున్న బ్రాహ్మణ అభ్యర్దుల కు ఉచిత శిక్షణ అందించనున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ప్రకటించింది. 

7.షర్మిల పై ఫిర్యాదు

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

టీఆర్ఎస్ ఎమ్మెల్యే లను ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్స్ పై స్పీకర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఫిర్యాదు చేశారు. 

8.తెలంగాణలో అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయం

  తెలంగాణలో అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించింది. 

9.కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 42.79 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. 

10.విజయసాయిరెడ్డి పై అయ్యన్న కామెంట్స్

  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు చేశారు.విజయసాయిరెడ్డి పెద్ద దొంగ అని , పదివేల కోట్లు దోచుకున్నారని అయ్యన్న ఆరోపించారు. 

11.ఉల్లి రైతులతో సూర్య ప్రకాష్ రెడ్డి ముఖా ముఖి

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూల్ మార్కెట్ యార్డ్ ను సందర్శించి ఉల్లి రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. 

12.భీమా చెక్కులు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి

  తెలంగాణ భవన్ లో రాజీవ్ ప్రమాద భీమా లబ్ధిదారులకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. 

13.టీడీపీ శాసనసభా పక్షం భేటీ

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ శాసన సభా పక్ష సమావేశం నేడు నిర్వహించనున్నారు. 

14.పెరుగుతున్న గోదావరి వరద

  ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.దీంతో లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 

15.శ్రీశైలం ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

శ్రీశైలం ప్రాజెక్టు కు క్రమ క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది.దీంతో ప్రాజెక్ట్ కు ఉన్న 9 గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

16.నితీష్ ను కలిసిన పీకే

  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

17.మద్రాసు హై కోర్ట్ కి సీజే గా దురై స్వామి

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

మద్రాసు హైకోర్టు తాత్కాలిక సీజే గా జస్టిస్ దురై స్వామి నియమితులు అయ్యారు. 

18.గోవా నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

  కాంగ్రెస్  కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గోవా నుంచి ప్రారంభం అయ్యింది. 

19.భారత్ లో కరోనా

Telugu Apcm, Ayyanna Patrudu, Bandi Sanjay, Cm Kcr, Corona, Nitish Kumar, Prasan

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,400
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,620

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube