టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.సినిమా విడుదలకు ఇంకా నెలన్నర సమయం ఉంది.
అయినా కూడా ఇప్పటి నుండే ట్రైలర్ సందడి చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా ప్రకటించారు.సాధారణం గా తెలుగు సినిమాల యొక్క థియేట్రికల్ ట్రైలర్స్ సినిమా లు వారం పది రోజుల్లో విడుదల కాబోతున్నాయి అనగా ట్రైలర్ లు వస్తూ ఉంటాయి.
కానీ శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ మాత్రం ఏకంగా నెల సమయం రిలీజ్ కి ఉండగానే రాబోతుంది.దర్శకుడు గుణశేఖర్ కి సినిమా పై ఉన్న నమ్మకం కారణంగానే ఇలా ముందస్తుగా విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
భారీ అంచనాల నడుమ గుణశేఖర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఈ సినిమా ను దిల్ రాజు సమర్పిస్తున్నాడు.ఫిబ్రవరి లో చాలా సినిమాలు పోటీ గా విడుదల కాబోతున్నాయి, అయినా కూడా కచ్చితంగా ఏ సినిమా భారీ వసూలను నమోదు చేసిందనే నమ్మకం తో ఫిబ్రవరి లోనే వాటికి పోటీగా విడుదల చేయబోతున్నారు.
తన యొక్క శక్తి మేరకు భారీ ఎత్తున ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో మరియు అన్ని ప్రాంతాల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా లో సమంత పాత్ర అత్యంత విభిన్నంగా ఉండబోతుంది.

పౌరాణిక నేపథ్యం లో రూపొందిన ఈ సినిమా సమంత కు అత్యంత కీలకం గా మారింది.గత కొంత కాలంగా సమంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఇటీవల ఆమె అనారోగ్య సమస్యల నుండి బయటపడి షూటింగ్ కార్యక్రమాలకు హాజరవుతుంది.ఇక వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కు ప్రమోషన్ కార్యక్రమాల్లో హాజరైనందుకు సమంత ఒకే చెప్పిందని సమాచారం అందుతుంది.







