సావిత్రి.తెలుగు సినిమా పరిశ్రమలో మహానటిగా గుర్తింపు పొందిన హీరోయిన్.
తన అభినయంతో ఎవర్ గ్రీన్ టాలీవుడ్ నటీమణిగా వెలుగు వెలిగింది.తెలుగు ఒక్కటే కాదు దక్షిణాది భాషలన్నింటిలోనూ తన అభినయంతో సత్తా చాటింది.
ఏ పాత్ర అయినా అవలీలగా చేస్తూ ఆకట్టుకునేది.ఏ పాత్రకు ఎంత మేర నటించాలో బాగా తెలిసిన వ్యక్తి తను.ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలే కాదు.అగ్రహీరోలు సైతం ఎదురు చూసేది.
నటిగా తన సత్తా చాటిన సావిత్రి.తెలుగులో మరే హీరోయిన్ సాధించని పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.
తను ఉన్నంత కాలం సినీ పరిశ్రమకు ఒంటి చేత్తో ఏలింది సావిత్రి.అలనాటి అందాల తార అసలు సినిమా రంగంలోకి ఎలా అడుగు పెట్టింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పట్లో ఒకనాడు ఉదయమం ఓ వ్యక్తి.ఒక అమ్మాయితో స్టిల్ ఫోటో గ్రాఫర్ నాగరాజారావు ఇంటికి వెళ్లాడు.ఈ అమ్మాయి తన కూతురని చెప్పాడు.సినిమాల్లో నటించాలి అనుకుంటుంటుదని వివరించాడు.
ఈమె స్టిల్స్ తీస్తే.సినిమా నిర్మాతలకు చూపించాలి అనుకుంటున్నాను అని వెల్లడించాడు.
ఆయన మరెవరో కాదు చౌదరి.తను చెప్పిన విధంగా ఆమె ఫోటోలను తీశాడు నాగరాజారావు.ఈ ఫోటోలను పలువురు సినిమా నిర్మాతలకు పంపాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు తనకు ఓ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది.ఈ సినిమా పేరు సంసారం.ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రంగనాథ్ దాస్ నిర్మించాడు.
అక్కినే నాగేశ్వర్ రావు, నందమూరి తారక రామారావు హీరోలు గా నటించారు.అయితే ఈ సినిమాలో ఆ అమ్మాయికి అవకాశం ఇస్తామని చెప్పిన నిర్మాతలు ఆ తర్వాత ఎందుకో వద్దు అని చెప్పారు.
ఆమె ముఖం మరీ అంతగా కళ లేదని చెప్పారు.తన స్థానంలో లక్ష్మిరాజ్యంకు అవకాశం ఇచ్చారు.

అనంతరం ఆ అమ్మాయికి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది.తనదైన శైలిలో నటనా చాతుర్యత కనబర్చి తిరుగలేని హీరోయిన్ గా మారిపోయింది.తెలుగు సినిమా పరిశ్రమలో తను మహానటిగా వెలిగింది.తను మరెవరో కాదు.సావిత్రి.