యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు ప్రస్తుతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాలతో ఇప్పుడు సైతం భారీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నారు.
ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్( Hero Ram ) సైతం ప్రస్తుతం హరీష్ శంకర్( Harish Shankar ) తో సినిమా చేస్తున్నాడనే టాక్ అయితే వినిపించింది.కానీ ఆ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాకి పోవడానికి గల కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు కానీ మొత్తానికైతే హరీష్ శంకర్ ఇప్పుడు సల్మాన్ ఖాన్( Salman Khan ) తో సినిమా చేస్తున్నాడు.టాలీవుడ్ లో సరైన సక్సెస్ ని అందుకోలేకపోతున్న హరీష్ శంకర్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అయినా సల్మాన్ ఖాన్ తో సినిమా చేసి భారీ విజయాన్ని దక్కించుకోవాలనే చేస్తున్నాడు మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా ఇస్తే ఏ సినిమా కూడా అంత పెద్ద భారీ సక్సెస్ అయితే సాధించలేకపోయింది.కాబట్టి ఇక మీదట చేయబోతున్న ఈ సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

మరి ఈ సినిమాతో కనక హరీష్ శంకర్ మంచి విజయాన్ని సాధిస్తే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతాడు.ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో రామ్ సాఫ్ట్ సినిమాలు చేయాలని చూస్తున్నాడు.అందుకే మహేష్ బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో పాటుగా మరో కొత్త దర్శకుడితో ఒక సినిమా కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా రామ్ కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
.