ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరిలో తమిళ సినిమా స్టార్ హీరో అయిన అజిత్( Ajith ) ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’( Good Bad Ugly ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుందంటూ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి బ్రాహ్మ రథం పడుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా అజిత్ లాంటి నటుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు.

ఇక ఇంతకుముందు వచ్చిన ‘పట్టుదల’ సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికి ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసి పెట్టింది.మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాయి.తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వారు నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందనే చెబుతున్నారు.

మరి ఈ సినిమా విజయాన్ని సాధించింది కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ అజిత్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శివ అజిత్ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నారట.ఇక వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ఇక ఇప్పటికే వీళ్ళ కాంబోలో నాలుగు సినిమాలు వచ్చి సూపర్ సూపర్ సక్సెస్ లను సాధించాయి.కాబట్టి మరోసారి అదే కాంబోను రిపీట్ చేయాలని మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి శివ గత సంవత్సరం కంగువా సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు… మరి ఇప్పుడు ఎలాంటి సినిమాతో అజిత్ ను చూపిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
.