బ్రిటన్‌కు(British) చెందిన ప్రముఖ యూట్యూబర్ జార్జ్ బక్లీ (George Buckley) ఇటీవల ఇండియాలో ట్రైన్ జర్నీ చేస్తూ ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.దాన్ని చూసి అతను షాక్ అవ్వడమే కాదు, ఆనందపడిపోయాడు కూడా.
ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంతకీ ఏం జరిగిందంటే, బక్లీ రైల్లో(Buckley on the train) ప్రయాణిస్తూ ఆన్‌లైన్‌లో ఒక శాండ్‌విచ్ ఆర్డర్ చేశాడు.
మరుక్షణమే అది నేరుగా తన సీటుకే డెలివరీ అయ్యింది.ఈ సంఘటన కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కాసేపు ఆగినప్పుడు జరిగింది.
బక్లీ వారణాసి (Buckley Varanasi)వెళ్లేందుకు ఏసీ ఫస్ట్-క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు.ప్రయాణంలో ఆకలేయడంతో, ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఉపయోగించి శాండ్‌విచ్ (Sandwich)ఆర్డర్ చేశాడు.మనలో చాలా మందికి రైల్లో ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం మామూలే అయినా, అతనికి మాత్రం ఇదో కొత్త, నమ్మలేని అనుభవం.అంత టెక్నాలజీ ఇండియాలో ఉందని చూసి అవాక్కయ్యాడు.
అసలు విషయం ఏంటంటే, తను ప్రయాణిస్తున్న ట్రైన్ కాన్పూర్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఆగుతుందని షెడ్యూల్ ఉంది.అయినా సరే, ఆ కొద్దిపాటి సమయంలోనే శాండ్‌విచ్(Sandwich) సమయానికి పర్ఫెక్ట్‌గా డెలివరీ కావడం అతన్ని ఆశ్చర్యపరిచింది.
బక్లీ తన వీడియోలో ఈ మొత్తం ప్రాసెస్‌ను యాప్‌లో ఆర్డర్ చేయడం దగ్గర్నుంచి, తన సీటు వద్ద శాండ్‌విచ్ అందుకోవడం వరకు వివరంగా రికార్డ్ చేశాడు.వీడియోలో అతను చాలా ఎగ్జైట్‌మెంట్‌తో, ఆశ్చర్యంతో కనిపించాడు.ఒక సందర్భంలో, “నేను ఇండియాలో ట్రైన్‌లో ఫుడ్ డెలివరీ (Food delivery on trains in India)తీసుకుంటున్నాను.నమ్మకపోతే, కాసేపు ఆగండి చూపిస్తా” అని అనడం మనం చూడొచ్చు.
ఆర్డర్ ఎలా పెట్టాలో అర్థమయ్యేలా చెప్పిన తోటి భారతీయ ప్రయాణికుడికి కూడా అతను థ్యాంక్స్ చెప్పాడు.డెలివరీ సక్సెస్ అయ్యాక, ఈ సర్వీస్ సౌలభ్యం చూసి బక్లీ ఫిదా అయిపోయాడు.
తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ “యూకే వాళ్లు మనల్ని చూసి నేర్చుకోవాలి” అని రాసుకొచ్చాడు.దీన్నిబట్టి భారతీయ రైల్వే వ్యవస్థ, అక్కడి టెక్నాలజీ అతన్ని ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది.చాలా మంది కామెంట్లలో తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు.
ఒకరు తాము ఒకసారి ఇలాగే పిజ్జాను సీటుకే డెలివరీ (Pizza delivered to your seat)చేయించుకున్నామని చెప్పారు.ఇంకొకరు సరదాగా, “యూకేలో ట్రైన్లు లేటవ్వడం, క్యాన్సిల్ అవ్వడం చూస్తే.అక్కడ ఇది అస్సలు సాధ్యం కాదు.” అని కామెంట్ చేశారు.
భారతదేశం గురించి, ఇక్కడి సౌకర్యాల గురించి పాజిటివ్‌గా షేర్ చేసినందుకు చాలా మంది బక్లీని మెచ్చుకున్నారు.“మీరు ఇండియాలో మీ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తూ, ఇక్కడి కల్చర్‌ను, సౌకర్యాలను మెచ్చుకోవడం చూడటం చాలా బాగుంది.ఇది సూపర్ కంటెంట్” అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.